Krishna : డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణగారు ఇక లేరు. సినీ ప్రపంచం మరో లెజెండరీ స్టార్ ని కోల్పోయింది. నిన్న ఉదయం కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం వార్తతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు సైతం కుప్పకూలిపోయారు.
మహేష్ బాబు శోకాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కావడం లేదు. తల్లి ఇందిరా దేవి మరణించి రెండు నెలలు గడవకముందే తండ్రి కృష్ణ కూడా మరణించడంతో మహేష్ బాబు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు కూడా తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదట. ఎంత పెద్ద హీరో అయినా సరే తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఖచ్చితంగా పాటించేవారు మహేష్ బాబు.
అయితే ఈ ఒక విషయంలో మాత్రం అమ్మనాన్న మాటలకు వ్యతిరేకించాడు మహేష్ బాబు. ఇక ఆ విషయం ఏమిటంటే.. మహేష్ బాబు కూతురు సితార ఓణీల ఫంక్షన్ మరొక పది రోజుల్లో గ్రాండ్ జరపాలని నిశ్చయించుకున్నారట. అది మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఆఖరి కోరిక. ఆమె బ్రతికి ఉన్నప్పుడు చాలాసార్లు మహేష్ ని ఈ విషయం అడిగారట. కానీ మహేష్ కు ఇలాంటి ఫంక్షన్లు చేయటం ఇష్టం లేకపోవడంతో రిజెక్ట్ చేశారట . ఇక తన తల్లి ఆఖరి కోరిక కావడంతో ఆమె మరణించిన తర్వాత ఆమె కోరిక తీర్చడానికి ఫంక్షన్ చేయడానికి సిద్ధపడ్డారట మహేష్ బాబు.
ఈ క్రమంలోనే మనవరాలు జీవితంలో జరిగే మొదటి ముచ్చటను చూడడానికి సూపర్ స్టార్ కృష్ణ ఎంతో సంతోషంగా వెయిట్ చేశారట. మొదటి నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణకు సితార అంటే చాలా ఇష్టం. స్వయానా కృష్ణ గారి తల్లి మహేష్ బాబుకి కూతురుగా పుట్టిందని కృష్ణ గారు నమ్మేవారట. సితారను అందరికన్నా ఎక్కువ ప్రేమగా చూసుకునే వారట కృష్ణ. అయితే మనవరాలి ఫంక్షన్ చూడాలని ఆశగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. ఈ విషయంతో ఘట్టమనేని అభిమానులు మరింత బాధపడుతున్నారు. కృష్ణ మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీలో వరస మరణాలు సంభవించడం వెనక ఏదో దోషం ఉందని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…