Super Star Krishna : సూపర్‌స్టార్ కృష్ణ యావత్ సినీ ఇండస్ట్రీని శోకసముద్రంలో ముంచి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన మధురమైన గుర్తులుగా అభిమానులకు ఆయన అందించిన అద్భుతమైన చిత్రాలు మాత్రమే పదిలంగా ఉంటాయి. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారిని ఇక చూడలేం. కృష్ణగారు ముందు నుంచి నిర్మాతల హీరో, ప్రయోగాలకు పెట్టింది పేరు. టాలీవుడ్‌లో తొలి సినిమాస్కోప్ సినిమా అయిన అల్లూరి సీతారామ రాజు (1974), ఈనాడు (1982) మొదటి ఈస్ట్‌మన్ కలర్ ఫిల్మ్ మరియు మొదటి 70 ఎంఎం చిత్రం సింహాసనం (1986), కొల్లేటి కాపురం సినిమాతో తెలుగులో తొలి ఆర్ వో టెక్నాలజీని, మొట్టమొదటి కౌబాయ్ వంటి చిత్రాలను పరిచయం చేశారు కృష్ణ.
అలాగే ఏఎన్నార్ చేసిన దేవదాసు మళ్లీ చేయడం, ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమాకు పోటీగా కురుక్షేత్రం సినిమా చేయడం ఆయన చేసిన సాహసోపేత సినిమాలు అని చెప్పవచ్చు. అందుకే ఆయన అభిమానులు ముద్దుగా డేరింగ్ అండ్ డాషింగ్, నెంబర్ వన్ హీరో అని పిలుచుకుంటారు. అప్పటి అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ ను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సూపర్ స్టార్ కృష్ణకి ఉండేది. కృష్ణ ఎక్కువుగా కుటుంబ కథా సినిమాల్లో నటించారు. అందుకే ఆయనకు మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అప్పటిలో ఎక్కువుగా ఉండేది. అప్పట్లోనే ఏ హీరోకు లేనంతగా రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవంటే కృష్ణకు అభిమానుల ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఎన్టీఆర్, ఏఎన్నార్ కి పోటీగా సంక్రాంతి బరిలో దిగి కృష్ణ రికార్డులను క్రియేట్ చేశారు. 4 దశాబ్దాల సినీ కెరీర్‌లో కృష్ణ నటించిన 30 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఏఎన్నార్ 33 , ఎన్టీఆర్ 31 సినిమాల తర్వాత కృష్ణే సంక్రాంతి బరిలో విజయాన్ని అందుకొని టాప్ హీరోల్లో మూడో స్థానంలో నిలిచారు. అంతేకాకుండా కృష్ణ నటించిన సినిమాలు వరుసగా 21 ఏళ్ల పాటు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి.
1976 నుంచి 1996 వరకు ప్రతి యేటా కృష్ణ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యేవి. ఈ రికార్డు తెలుగు దిగ్గజ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు కూడా లేదు. ఇక 1964, 95 మధ్యకాలంలో ఆయన యేడాదికి 10కుపైగా సినిమాల్లో నటించారు. 1972 సంవత్సరంలో కృష్ణ గారు నటించిన 18 చిత్రాలలో 90% పైగా చిత్రాలు ఘనవిజయాన్ని అందుకున్నాయి. ఒకే ఏడాది 18 చిత్రాలు రిలీజ్ చేసిన ఘనత ఒక కృష్ణ గారికే దక్కింది. ఒక్కోసారి రోజుకు ఆయన 18 గంటల పాటు మూడు షిఫ్టులు వారీగా కంటిన్యూగా పనిచేసేవారు. ఇంత కష్టపడి ఆయన చిత్రాలు చేసేవారు కాబట్టే అభిమానుల గుండెల్లో సూపర్ స్టార్ గా నిలిచిపోయారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…