Kirak RP Chepala Pulusu : నెల్లూరు చేప‌ల‌తో ఘుమ‌ఘుమ‌లాడిస్తున్న ఆర్పీ.. చేప‌ల పులుసు రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Kirak RP Chepala Pulusu : జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్లు చాలామంది జీవితంలో మంచిగానే స్థిరపడ్డారు. వారిలో కిరాక్ ఆర్పీ ఒకడు. నెల్లూరు యాసలో అతను జబర్దస్త్ స్కిట్లలో పండించిన విధానం ప్రతి ఒక్క‌రిని ఆకట్టుకుంది. ఇక్కడ వచ్చిన పేరుతో పెద్ద ఎత్తున ఈవెంట్లు చేయడం.. వేరే షోల్లో, సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో అతడి దశ తిరిగిపోయిందినే చెప్పాలి. అయితే ఆర్పీ ఇటీవలే ఓ వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం.. కర్రీ పాయింట్ కావడం విశేషం. అతను పెట్టింది మామూలు కర్రీ పాయింట్ కాదు. నెల్లూరు చేపల పులుసు మాత్రమే అమ్మే కర్రీ పాయింట్. ఆంధ్రా ప్రాంతాల్లో చేపల పులుసుకు ఫేమస్ అయిన వాటిలో నెల్లూరు ఒకటి. కాగా, తన ఊరి టేస్టు మిగతా వాళ్లకు కూడా పరిచయం చేయడానికి కాస్త పెద్ద‌గానే ఈ చేప‌ల క‌ర్రీ పాయింట్ పెట్టాడు.

ప్రాపర్ ప్లానింగ్ లేకుండా క‌ర్రీ పాయింట్ ఏర్పాటు చేయ‌డంతో చెఫ్‌ల కొరత ఏర్పడి.. కొన్నాళ్లు దుకాణం బంద్ చేశాడు. ఆపై తన నెల్లూరు వెళ్లి.. అక్కడ చేపల పులుసు వండటంలో చేయి తిరగినవారిని తీసుకు వ‌చ్చి మ‌ళ్లీ రీ ఓపెన్ చేశాడు. డిమాండ్‌కి తగ్గట్లుగా కిచెన్ కెపాసిటీ కూడా పెంచేశాడు. ప్రజంట్ అయితే కూకట్‌పల్లిలో బ్రాంచ్ నడుస్తుంది. జనాలు గట్టిగానే అక్కడికి వెళ్తున్నాడు. నెల్లూరు స్లైల్లో మామిడికాయ వేసి.. పులుసు చేయిస్తున్నాడు ఆర్పీ. సన్న చేపల పులుసు, కొరమీను పులుసు, బొమ్మిడాయిల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు అతని వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో.. ఈ చేపల పులుసే ట్రెండింగ్ అని చెప్పాలి.

Kirak RP Chepala Pulusu

చేప‌ల పులుసుకి మంచి గిరాకి ఏర్ప‌డ‌డంతో కొత్త బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లు చేస్తున్నాడ‌ట ఆర్పీ. అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్లో ధరలు ఎంత ఉన్నాయో అందరికీ తెలియదు. ఆ ధరలు చూస్తే.. వైట్ రైస్–75 రూపాయలు, రాగి సంగటి–100 రూపాయలు, చేప తలకాయ పులుసు –200 రూపాయలు, సన్న చేపల పులుసు 250 రూపాయలు, రవ్వ చేపల పులుసు – 285 రూపాయలు, బొమ్మిడాయిల పులుసు–375 రూపాయలు, కొరమేను పులుసు –375 రూపాయలుగా ఉన్నాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM