Kirak RP Chepala Pulusu : జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్లు చాలామంది జీవితంలో మంచిగానే స్థిరపడ్డారు. వారిలో కిరాక్ ఆర్పీ ఒకడు. నెల్లూరు యాసలో అతను జబర్దస్త్ స్కిట్లలో పండించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక్కడ వచ్చిన పేరుతో పెద్ద ఎత్తున ఈవెంట్లు చేయడం.. వేరే షోల్లో, సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో అతడి దశ తిరిగిపోయిందినే చెప్పాలి. అయితే ఆర్పీ ఇటీవలే ఓ వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం.. కర్రీ పాయింట్ కావడం విశేషం. అతను పెట్టింది మామూలు కర్రీ పాయింట్ కాదు. నెల్లూరు చేపల పులుసు మాత్రమే అమ్మే కర్రీ పాయింట్. ఆంధ్రా ప్రాంతాల్లో చేపల పులుసుకు ఫేమస్ అయిన వాటిలో నెల్లూరు ఒకటి. కాగా, తన ఊరి టేస్టు మిగతా వాళ్లకు కూడా పరిచయం చేయడానికి కాస్త పెద్దగానే ఈ చేపల కర్రీ పాయింట్ పెట్టాడు.
ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కర్రీ పాయింట్ ఏర్పాటు చేయడంతో చెఫ్‌ల కొరత ఏర్పడి.. కొన్నాళ్లు దుకాణం బంద్ చేశాడు. ఆపై తన నెల్లూరు వెళ్లి.. అక్కడ చేపల పులుసు వండటంలో చేయి తిరగినవారిని తీసుకు వచ్చి మళ్లీ రీ ఓపెన్ చేశాడు. డిమాండ్‌కి తగ్గట్లుగా కిచెన్ కెపాసిటీ కూడా పెంచేశాడు. ప్రజంట్ అయితే కూకట్‌పల్లిలో బ్రాంచ్ నడుస్తుంది. జనాలు గట్టిగానే అక్కడికి వెళ్తున్నాడు. నెల్లూరు స్లైల్లో మామిడికాయ వేసి.. పులుసు చేయిస్తున్నాడు ఆర్పీ. సన్న చేపల పులుసు, కొరమీను పులుసు, బొమ్మిడాయిల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు అతని వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో.. ఈ చేపల పులుసే ట్రెండింగ్ అని చెప్పాలి.

చేపల పులుసుకి మంచి గిరాకి ఏర్పడడంతో కొత్త బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలు చేస్తున్నాడట ఆర్పీ. అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హోటల్లో ధరలు ఎంత ఉన్నాయో అందరికీ తెలియదు. ఆ ధరలు చూస్తే.. వైట్ రైస్–75 రూపాయలు, రాగి సంగటి–100 రూపాయలు, చేప తలకాయ పులుసు –200 రూపాయలు, సన్న చేపల పులుసు 250 రూపాయలు, రవ్వ చేపల పులుసు – 285 రూపాయలు, బొమ్మిడాయిల పులుసు–375 రూపాయలు, కొరమేను పులుసు –375 రూపాయలుగా ఉన్నాయి.