Kiara Advani : నటి కియారా అద్వానీ బోల్డ్ సన్నివేశాల్లో చేసేందుకు ఎంత మాత్రం మొహమాట పడదనే చెప్పవచ్చు. ఆ మాటకొస్తే ఆమె నటించిన కొన్ని సిరీస్‌లలో విపరీతమైన బోల్డ్ క్యారెక్టర్లలో నటించింది. అయితే ఇప్పుడు ఆమె అడ్వర్టయిజ్‌మెంట్ల విషయంలోనూ అదే పద్ధతిని పాటిస్తోంది. ఏ బ్రాండ్‌కు యాడ్ చేసినా.. స్కిన్ షో చేస్తోంది. అది సరే.. అంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. తేడా వస్తే మాత్రం నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ కు గురి కాక తప్పడం లేదు. తాజాగా కియారాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
కియారా అద్వానీ ఇటు తెలుగు, అటు హిందీ మూవీల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే పలు బ్రాండ్లకు ప్రచారం కూడా చేస్తోంది. ఇక బోట్ కంపెనీకి కూడా ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఎప్పటినుంచో కొనసాగుతోంది. సదరు కంపెనీ పలు రకాల ఆడియో ప్రొడక్ట్స్‌ను తయారు చేయడంలో పేరు గాంచింది. అయితే ఆ కంపెనీకి చెందిన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్యాక్‌పై కియారా అద్వానీ ఫొటోను ముద్రించారు.
Note: This is NOT a Sports Bra Ad pic.twitter.com/ze3UShIWA5
— Ankush (@_James_Bong) November 20, 2021
సదరు ఫొటోలో కియారా స్పోర్ట్స్ బ్రా ధరించి ఉంది. కానీ ఆమె చెవుల్లో ఉన్న బోట్ కంపెనీకి చెందిన ఇయర్ బడ్స్ కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
https://twitter.com/its_rahulkr/status/1462073681916542984
అసలు ఆమె ఇయర్ బడ్స్ కు ప్రచారం చేస్తుందా.. లేదా స్కిన్ షో చేస్తుందా.. లేక ఏదైనా కంపెనీకి చెందిన స్పోర్ట్స్ బ్రాను ప్రచారం చేస్తుందా..? అని కియారా అద్వానీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ ఫొటోను 1 నిమిషం పాటు జాగ్రత్తగా చూస్తేనే తప్ప ఆమె చెవుల్లో ఇయర్ బడ్స్ ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో ఆ ఫొటోను చూస్తే నిజంగానే అది స్పోర్ట్స్‌బ్రాకు చెందిన యాడ్ అనుకుంటారు. అందుకనే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
They know the product is not worth the price. So need some skinshow to sell it. Now customer has to decide what is he buying. https://t.co/cdWVgDWOvr
— ꪜɨӄཞǟʍ (@roastedmakhana) November 20, 2021
ఇక ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్‌లో భూల్ భులయ్యా 2 అనే మూవీతోపాటు జుగ్ జుగ్ జీయో అనే మూవీలోనూ నటిస్తోంది. తెలుగులో ఈమె రామ్ చరణ్ సరసన మూవీలో నటిస్తోంది. ఆ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.