Allu Arha Birthday : అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం విదితమే. అయితే పుష్ప మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఓ వైపు అల్లు అర్జున్ తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఆయన కుటుంబానికి మాత్రం కచ్చితంగా సమయం కేటాయిస్తారు. వారికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ అల్లు అర్జున్ పాల్గొంటుంటాడు. ఇక తాజాగా అల్లు అర్జున్ తన కుమార్తె అర్హ బర్త్ డే సందర్భంగా ఆ దంపతులు ఆమెకు స్పెషల్ గిఫ్ట్‌ను కూడా ఇచ్చారు.
అల్లు అర్జున్ ఖాళీగా కాస్తంత సమయం దొరికినా తన కుటుంబానికే కేటాయిస్తారు. ఈ క్రమంలోనే తన భార్య, పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. అల్లు అర్జున్ భార్య స్నేహ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తమ విషయాలను ఆమె షేర్ చేస్తుంటుంది. తమ పిల్లలు అయాన్, అర్హల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే నవంబర్ 21న తమ కుమార్తె అర్హ బర్త్ డే సందర్భంగా ఓ వీడియోను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
https://www.instagram.com/reel/CWhhPDWlrIf/?utm_source=ig_embed&ig_rid=6c88d914-ee13-46e4-aed0-ad747c88c5ec
అల్లు అర్హ నేటితో 5 ఏళ్లు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే స్నేహ షేర్ చేసిన వీడియోలో అర్హ చెస్ ఆడడాన్ని చూడవచ్చు. అలాగే ఆమె గేమ్‌ను అల్లు అర్జున్ కుటుంబం ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. తరువాత తన బహుమతులను చూపిస్తుంది అర్హ. ఈ క్రమంలోనే తమ కుమార్తెను అల్లు అర్జున్, స్నేహలు చూస్తుంటారు. వారందరూ అర్హను ముద్దు చేస్తూ కనిపిస్తారు.
ఇక అల్లు అర్హ తాజాగా యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డును సొంతం చేసుకుంది. నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు.