Keerthy Suresh : నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కీర్తి మహానటి నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఇక ఆ సినిమా నుండి కీర్తి హవాకి తిరుగు లేకుండా పోయింది. స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది.
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్‌ను ఇవ్వలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది కీర్తి సురేష్. సర్కారు వారి పాట చిత్రం మే 12న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందే కీర్తి సురేష్ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం సాని కాయిదమ్. ఈ చిత్రాన్ని తెలుగులో చిన్ని పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6న చిన్ని మూవీ రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కీర్తి సురేష్ గ్లామర్ పాత్రలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొదటి నుండి తాను నటనపైనే దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. గ్లామర్ విషయంలో తాను కొన్ని పరిమితులు పెట్టుకున్నానని చెప్పిన కీర్తి సురేష్ వాటిని అధిగమించను అని అంటోంది. తన ఆలోచనా విధానం, తన నటన నచ్చిన ప్రేక్షకులు తప్పకుండా చూస్తారని ధీమా వ్యక్తం చేసింది. కోట్లు ఇచ్చినా తాను గ్లామర్ షోకు దూరంగానే ఉంటానని.. ఎట్టి పరిస్థితిలోనూ ఆ పని చేయనని ఈమె స్పష్టం చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కథానాయికగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించి ఆశ్చర్యపరుస్తోంది. చిరంజీవితో భోళా శంకర్, నానికి జోడీగా దసరా చిత్రాల్లో నటిస్తోంది. మరిన్ని ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…