Archana : దేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి తప్పక ఉంటారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేశాడు ఈ దర్శకుడు. ఇక రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్‌తో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. త్వరలో మహేష్‌తో మూవీ చేయనుండగా, ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉన్నత స్థాయికి వెళుతున్న రాజమౌళి సినిమాలలో నటించాలని ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆశపడడం సహజం. కానీ తెలుగు అమ్మాయి అర్చన శాస్త్రి వచ్చిన ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట.
అర్చన మొదట వేద అనే పేరుతో ఇండస్ట్రీకి పరిచయమైంది. తపన అనే సినిమా ద్వారా మొట్టమొదట హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అన్నపూర్ణమ్మ గారి మనవడు అనే సినిమాలో కూడా అర్చన హీరోయిన్ గా నటించింది. అయితే అర్చనకు హీరోయిన్‌గా కన్నా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కి సంబంధించి ఆఫర్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ క్రమంలో రాజమౌళి తెరకెక్కించిన మగధీరలో ముఖ్యమైన పాత్రలో ఆఫర్ వచ్చిందట.
ఓ కీలక పాత్ర కోసం సంప్రదించగా తాను హీరోయిన్ గానే సెటిల్ అవ్వాలని అర్చన ఆ సినిమాకు నో చెప్పింది. ఈ విషయాన్ని తాజాగా అర్చన ఇంటర్వ్యూలో వెల్లడించింది. మగధీర సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం తనను సంపాదించారని తెలిపింది. కానీ తాను హీరోయిన్ గానే చేయాలని అనుకున్నట్టు తెలిపింది. సినిమా విడుదలై మంచి హిట్ సాధించిన తర్వాత ఎందుకు నటించలేదా అని బాధపడినట్టు చెప్పింది అర్చన. ఈ అమ్మడు ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తుండగా, ఆ మధ్య బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లో అడుగుపెట్టింది. ఉన్నన్ని రోజులు బాగానే సందడి చేసి అలరించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…