సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అలాగే కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోపాటు కమర్షియల్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇటీవల కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి సర్కారు వారి పాటతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం కీర్తి సురేష్ ఫిల్మ్ కెరీర్ గురించి కాకుండా వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కబోతోందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదికూడా తల్లిదండ్రులు నిశ్చయించిన వ్యక్తితోనే వివాహం జరగబోతోందని అంటున్నారు. అతను ఓ వ్యాపారవేత్తని, రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటాడని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ల విషయంలో ఇలాంటి గాసిప్స్ రావడం సహజమే. అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ ఇంకా స్పందించలేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తో జంటగా మామన్నన్ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో నాచురల్ స్టార్ నాని సరసన దసరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్ భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. కెరీర్ మంచి స్వింగ్‌లో ఉండగా కీర్తి పెళ్లికి అంగీకరించిందంటే నమ్మశక్యంగా లేదని అంటున్నారు. మరి దీనిపై ఆమె ఏమైనా స్పందిస్తుందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…