Keerthy Suresh : మ‌రోసారి త‌ల్లిగా క‌నిపించ‌నున్న కీర్తి సురేష్‌.. ఇంత రిస్క్‌లు అవ‌స‌రమా..?

Keerthy Suresh : నేను శైల‌జ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డికి మ‌హాన‌టి చిత్రంతో మంచి గుర్తింపు ద‌క్కింది. ఈ సినిమా త‌ర్వాత కీర్తికి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆఫ‌ర్స్ ఎక్కువ‌గా వ‌చ్చాయి. ఆమె లేటెస్ట్ మూవీ గుడ్ లక్ సఖి సైతం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గుడ్ లక్ సఖి మూవీలో విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు. అయితే కీర్తి సురేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో రెండు భిన్నమైన షేడ్స్ లో నటించి మెప్పించింది. షూటర్ గా ఆమె నటన చాలా సహజంగా సాగింది.

Keerthy Suresh

మహానటి తర్వాత కీర్తి క్రేజ్ మారడంతో వరుసగా మూడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ ల‌క్ సఖి. వీటిలో పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలకు అంకితమైతే గుడ్‌లక్ సఖి ఒక్కటే బిగ్‌స్క్రీన్స్‌కి నోచుకుంది. కానీ.. ఆశించినంత క్రెడిట్ మాత్రం దక్కలేదు కీర్తికి. చివరకు తలైవా సినిమా కూడా నిరాశపర్చిన బాపతే. సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెల్లిగా నటించినా కూడా ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఇక ఎప్పుడో కంప్లీటైన తమిళ్ మూవీ సానికాయితం కూడా డిజిటల్ స్క్రీన్స్‌కే పరిమితమవుతోంది. మెగాస్టార్‌ మూవీ భోళాశంకర్‌లో సోదరి పాత్రకే పరిమితమవుతోంది.

ఇప్పుడు కీర్తి సురేష్ హోప్స్ అన్నీ సర్కారువారి పాట పైనే ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా శర్వానంద్ ఇప్పుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమాకి సంతకం చేసినట్లు సమాచారం. ఈ దర్శకుడు నటుడు నితిన్‌తో ఛల్ మోహన్ రంగ చిత్రానికి పనిచేశాడు. ముందుగా ఈ సినిమా కోసం కృతి శెట్టిని ప‌రిశీలించారు. ఆమె నో చెప్ప‌డంతో కీర్తిని సంప్ర‌దించ‌గా ఆమె ఓకే చెప్పింది. ఇందులో కీర్తి సురేష్ బిడ్డ‌కు త‌ల్లిగా క‌నిపించ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే ఆమె పెంగ్విన్‌లో తల్లి పాత్రను చేసింది. మ‌రోసారి ఆమె ఓ బిడ్డకు తల్లిగా చేస్తాన‌న‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో ఇంత‌టి రిస్క్ చేయ‌డం అవ‌స‌ర‌మా.. అని ఫ్యాన్స్ అంటున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM