Keerthy Suresh : నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ అమ్మడికి మహానటి చిత్రంతో మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా తర్వాత కీర్తికి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆఫర్స్ ఎక్కువగా వచ్చాయి. ఆమె లేటెస్ట్ మూవీ గుడ్ లక్ సఖి సైతం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గుడ్ లక్ సఖి మూవీలో విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు. అయితే కీర్తి సురేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో రెండు భిన్నమైన షేడ్స్ లో నటించి మెప్పించింది. షూటర్ గా ఆమె నటన చాలా సహజంగా సాగింది.

మహానటి తర్వాత కీర్తి క్రేజ్ మారడంతో వరుసగా మూడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి. వీటిలో పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలకు అంకితమైతే గుడ్‌లక్ సఖి ఒక్కటే బిగ్‌స్క్రీన్స్‌కి నోచుకుంది. కానీ.. ఆశించినంత క్రెడిట్ మాత్రం దక్కలేదు కీర్తికి. చివరకు తలైవా సినిమా కూడా నిరాశపర్చిన బాపతే. సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెల్లిగా నటించినా కూడా ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఇక ఎప్పుడో కంప్లీటైన తమిళ్ మూవీ సానికాయితం కూడా డిజిటల్ స్క్రీన్స్‌కే పరిమితమవుతోంది. మెగాస్టార్ మూవీ భోళాశంకర్‌లో సోదరి పాత్రకే పరిమితమవుతోంది.
ఇప్పుడు కీర్తి సురేష్ హోప్స్ అన్నీ సర్కారువారి పాట పైనే ఉన్నాయి. ఇదిలా ఉండగా శర్వానంద్ ఇప్పుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమాకి సంతకం చేసినట్లు సమాచారం. ఈ దర్శకుడు నటుడు నితిన్‌తో ఛల్ మోహన్ రంగ చిత్రానికి పనిచేశాడు. ముందుగా ఈ సినిమా కోసం కృతి శెట్టిని పరిశీలించారు. ఆమె నో చెప్పడంతో కీర్తిని సంప్రదించగా ఆమె ఓకే చెప్పింది. ఇందులో కీర్తి సురేష్ బిడ్డకు తల్లిగా కనిపించనుందట. ఇప్పటికే ఆమె పెంగ్విన్‌లో తల్లి పాత్రను చేసింది. మరోసారి ఆమె ఓ బిడ్డకు తల్లిగా చేస్తాననడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంతటి రిస్క్ చేయడం అవసరమా.. అని ఫ్యాన్స్ అంటున్నారు.