Karthikeya 2 : ప్రస్తుతం ఎక్కడ చూసినా కార్తికేయ-2 మానియానే కనిపిస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రోజు లిమిటెడ్ స్క్రీన్‌లలో విడుదలైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపైంది. ఇక ఫస్ట్‌డేకు మించిన కలెక్షన్ లను సెకండ్ డే సాధించి.. కంటెంట్ ఉంటే కలెక్షన్లకు తిరుగుండదని మరోసారి నిరూపించింది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్ళను సాధిస్తోంది.
ముఖ్యంగా బాలీవుడ్‌లో రోజు రోజుకూ కార్తికేయ-2పై క్రేజ్ పెరిగిపోతోంది. కార్తికేయ-2 చిత్రం బాలీవుడ్‌లో మొదటి రోజు కేవలం 60 స్క్రీన్‌లలో విడుదలైంది. ఇక రెండో రోజు ఏకంగా 300 స్క్రీన్లకు పెరిగింది. దీనికి పోటీగా అమీర్‌ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ వంటి సినిమాలున్నా బాలీవుడ్ ప్రేక్షకులు కార్తికేయ-2 చిత్రం వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ చిత్రంతో యంగ్ హీరో నిఖిల్‌కు బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది.
ఈవారం వచ్చే కృష్ణాష్టమికి ఈ సినిమా పీక్స్‌కి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రం కావడంతో హిందూ అనుకూల ప్రేక్షకులు ఈ కాన్సెప్ట్‌ని ఆదరించి థియేటర్లకు తరలి వస్తున్నారు. ఈ సినిమా మరికొన్ని వారాలు మంచి ఆక్యుపెన్సీలతో రన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
దేశంలో సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీకి కూడా ఇదే విధమైన స్పందన లభించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆ చిత్రం కూడా హిందూత్వ వేవ్ పై 2022లో సూపర్ హిట్ గా నిలిచింది. కాబట్టి కార్తికేయ 2 కూడా మినీ కాశ్మీర్ ఫైల్స్ గా మారుతోంది అంటున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ మరోసారి జాక్‌పాట్ కొట్టారు. అలాగే నిఖిల్ ఈ సినిమాతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఇకముందు నిఖిల్ కి బాలీవుడ్ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ 2 భారీ హిట్ అవడంపై చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…