Tejaswi Madivada : తెలుగు సినీ నటి, బిగ్ బాస్ భామ తేజస్వి మడివాడ గురించి అందరికీ తెలిసిందే. వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో నటిగా మారింది తేజస్వి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ తెలుగమ్మాయి అనంతరం రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీమ్‌తో తొలిసారి హీరోయిన్‌గా మారింది. అలాగే బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తేజస్వి తాజాగా కమిట్‌మెంట్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహించారు. ఈ సినిమాను బల్‌దేవ్ సింగ్, నీలిమా నిర్మించగా నరేష్ కుమారన్ సంగీతం అందించారు.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆగస్టు 19న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా తేజస్వి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అవకాశాలు లేకపోవడం వల్లే అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తున్నాను అని అనడం తప్పు. నాకు ఆఫర్లు ఉన్నప్పుడే నేను ఐస్‌క్రీమ్ అడల్ట్ కంటెంట్ సినిమా చేశాను. అలాగని అడల్ట్ కంటెంట్ సినిమాలు చేసిన వారంతా స్టార్స్ అయిపోతారని అనుకోవద్దు. అలాగే మా కమిట్‌మెంట్ సినిమాలో శ్రీరెడ్డి గురించి అలాగే రాం గోపాల్ వర్మ గురించి కూడా ఉంటుంది.
మనకు ఏదైనా చేయాలని ఉంటే చేసేయాలి కానీ శ్రీరెడ్డి చేయాల్సినవన్నీ చేసి ఇతరులపై ఆరోపణలు చేయడం ఏంటో అర్ధం కాదు అంది తేజస్వి. ఇక తన నిజ జీవితంలో తనని ఎవరు కమిట్మెంట్ అడగలేదని అలా అడగాలన్నా కూడా భయపడేవారు అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది. కమిట్‌మెంట్ సినిమాలో నా క్యారెక్టర్ పేరు తేజస్వి. నా క్యారెక్టర్‌ను నేనే ప్లే చేస్తున్నాను అని తేజస్వి చెప్పు కొచ్చింది. మరి తేజస్వి మాటలకు శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…