Indraja : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి ఇంద్రజ గురించి అందరికీ తెలిసిందే. కెరియర్ మొదట్లో యాంకర్ గాను, బుల్లితెర సీరియల్స్ లోను నటించి గుర్తింపు పొందారు. ఈ విధంగా పలు బుల్లి తెర సీరియల్స్ లో నటించిన ఈమెకు క్రమంగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అన్నా.. హీరోయిన్ అయిన తరువాత అయినా ఆచి తూచి అడుగులు వేయాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా.. ఇక అంతే సంగతులు. ఇదే విషయాన్ని ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది ఇంద్రజ. ఒకప్పటి ఐటమ్ సాంగ్ భామ.. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ఇంద్రజ. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో.. ఈ పాట నాటి నుంచి నేటి వరకు వినిపిస్తూనే ఉంది.
అందులో ఇంద్రజ పెర్ఫార్మన్స్ ను ఎవరూ మర్చిపోలేరు. ఆ అందం.. ఆ రూపం..ఆ నవ్వు.. అబ్బో ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్లకు మించిపోయే అందం ఉన్నా కానీ ఇంద్రజకి కొన్ని ఆఫర్స్ చేతికి వచ్చిన్నట్లే వచ్చి చేజారిపోయాయి. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. ఐటమ్ సాంగ్స్ చేసి హీరోయిన్ గా ఎదుగుతున్న తన కెరీర్ కి బ్రేకులు వేసుకుంది. ఆ రోజుల్లోనే ఇంద్రజ రెండు ఐటమ్ సాంగ్స్ చేసింది. నాగార్జున సరసన కన్నెపిట్టరో స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసి అలరించింది. అలాగే ఓ తమిళ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేసి మెప్పించింది.
తాజా ఇంటర్వ్యూలో వాటి గురించి అడగ్గా.. ఇంద్రజ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నిజానికి అలాంటి సాంగ్స్ చేయాలని ఏ హీరోయిన్ కి ఉండదు. పెద్ద వాళ్ల రిక్వెస్టుపైనే ఎక్కువగా చేస్తాం. పెద్ద బ్యానర్ అడిగినప్పుడు మనం నో చెప్పితే.. బాగుండదు. పెద్ద బ్యానర్ కదా అనే చాలామంది ఒప్పుకోవాల్సి వస్తుంది. నేను ఇష్టం లేకుండానే ఆ పాటలు చేశాను. అయినా, ఇప్పుడు వాటి గురించి ఎందుకులేండి. ఇప్పుడు ఏమన్నా అంటే లేనిపోని వివాదాలు వస్తాయి. అందుకే వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. అని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్లు బలవంతంగా హీరోయిన్స్ ని ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పకనే చెప్పినట్టైంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…