Karthika Deepam 27 Nov Today Episode : సౌందర్య చాలా సంతోషంగా కనిపిస్తుంది. మరోవైపు దీప కూడా కార్తీక్ తో సంతోషంగా గడుపుతుంది. తమ తల్లిదండ్రుల ఆనందాన్ని చూసి పిల్లలు మురిసిపోతారు. కార్తీక్ ఇంటి బయట మోనిత తన బాబు, ప్రియమణితో కలిసి ఎదురుచూస్తుంది. అప్పుడే సౌందర్య వాళ్ళు వాకింగ్ అని బయటకి వెళ్లేటప్పుడు వాళ్ళను చూసి దాక్కుంటుంది. ప్రియమణి మోనితను ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో మోనిత కోపంతో రగిలిపోతుంది.
ఇక ఇంట్లో కార్తీక్, ఆదిత్య కలిసి టిఫిన్ చేస్తుంటారు. దీప వాళ్లతో సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే మురళి కృష్ణ వచ్చి దీపను పక్కకు పిలిచి బయట మోనిత ఎదురు చూస్తుందని అంటాడు. దీప వెళ్లి కార్తీక్ తో మోనిత గురించి చెబుతుంది. వెంటనే ఆదిత్య కోపంతో రగిలిపోతాడు. తన పని ఏంటో చూస్తానని అనడంతో కార్తీక్ కంట్రోల్ చేస్తాడు. మరో వైపు బస్తీలో వారణాసి క్యాంపు ఏర్పాట్లు హడావుడి చేస్తూ ఉంటాడు. దీప గురించి గొప్పగా మాట్లాడతాడు.
కార్తీక్ వాళ్ళ కోసం భోజనం ఏర్పాట్లు చేస్తారు. ఇంట్లో నుండి దీప, కార్తీక్ క్యాంపుకు బయలుదేరుతారు. బయట కారు ఆపి మోనిత కోసం చూస్తారు. మోనిత లేదని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వెంటనే మోనిత వాళ్లని ఫాలో అవుతుంది. కార్తీక్ బస్తీలో క్యాంప్ కు వెళ్లి అందరికీ చెకప్ చేస్తాడు. అక్కడ ఒకామె తన భర్త తన పిల్లలు పట్టించుకోవడంలేదని అనడంతో అసలు వాడు తండ్రేనా అని కార్తీక్ అంటాడు. వెంటనే మోనిత ఎంట్రీ ఇచ్చి ఆ ప్రశ్నలు నేను వేయాలి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది.
తరువాయి భాగంలో మోనిత బస్తీ వాళ్ళ ముందు కార్తీక్ పరువు తీయడానికి ప్రయత్నించడంతో దీప తనకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక బస్తీ వాళ్లు కూడా కోపంతో మోనిత దగ్గరికి వెళ్లి తనపై చీపుర్లు ఎత్తి బెదిరిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…