Bigg Boss 5 : అన్ని ప్రాంతీయ భాషలలోనూ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ 5 జరుపుకుంటోంది. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్‌గా ఉన్నారు. అయితే ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఇప్పుడు బిగ్‌బాస్ ను హోస్ట్ చేయలేని పరిస్థితి. దీంతో నిర్వాహకులు ఓ ప్లాన్ చేసి కమల్ హాసన్ కూతురు శృతి హాసన్‌ని రంగంలోకి దింపుతున్నట్టు వార్తలు వచ్చాయి.
కానీ కోలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమిళ బిగ్‌బాస్‌ను శ్రుతిహాసన్ హోస్ట్ చేయడం లేదట. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తమిళంలో హోస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. బాహుబలితో మరోసారి ఆమెకు ఆమే సాటి అనిపించుకున్న ఎవర్ గ్రీన్ రమ్యకృష్ణ హోస్ట్‌గా రాబోతున్నారు. కమల్‌తో ఆమె ‘పంచతంత్రం’ సినిమా చేశారు. ఇప్పుడు కమల్‌కి బదులు ‘బిగ్ బాస్’ సీజన్ 5 కి హోస్టింగ్ చెయ్యబోతున్నారు. కమల్ వచ్చే వరకు ఆ బాధ్యతలను రమ్యకృష్ణనే మోయనున్నారట.
తెలుగులో రమ్యకృష్ణకు బిగ్ బాస్ కార్యక్రమం హోస్ట్ చేసిన అనుభవం ఉంది. నాగార్జున తన 60వ బర్త్ డే సందర్భంగా విహార యాత్ర కోసం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన క్రమంలో హోస్ట్‌గా రమ్యకృష్ణ రంగ ప్రవేశం చేశారు. రెండు రోజులపాటు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇంటి సభ్యుల తీరును రమ్యకృష్ణ ఘాటుగా ప్రశ్నిస్తూ తన హుందాతనాన్ని చాటుకొన్నారు. ఇప్పుడు కూడా ఆమె అలరించడం ఖాయం.. అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…