Ram Charan : రామ్ చరణ్ ను తిట్టిపోస్తున్న కన్నడ ఇండస్ట్రీ.. అసలు కారణం అదే..!

Ram Charan : తమిళం, మలయాళం, కన్నడ వంటి ఇతర భాషల డైరెక్టర్స్ ఒక్క సక్సెస్ ని అందుకుంటే చాలు వెంటనే ఆ దర్శకుల దృష్టి మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ పైకి వచ్చేస్తుంది. స్క్రిప్ట్ లతో సహా టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఇదే విషయం ఇతర భాషా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీకు అవకాశం కల్పించిన తల్లి లాంటి ఇండస్ట్రీని వదిలి మరో ఇండస్ట్రీపై ఆసక్తి చూపించడం ఎంతవరకు న్యాయం అంటూ తిట్టిపోస్తున్నారు. తమ కన్నడ హీరోలతో నెక్ట్స్ సినిమాలు చేస్తే కన్నడ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది కదా అంటున్నారు.

దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఒక సినిమా డైరెక్ట్ చేస్తే భారీ ఎత్తులో రెమ్యూనరేషన్ అందుకుంటారు దర్శకులు. సినిమాకు భారీ ఎత్తున బడ్జెట్ పెట్టడానికి కూడా నిర్మాతలు వెనుకాడరు. ఈ కారణాల వలన ఇప్పుడు కన్నడ దర్శకులు కూడా టాలీవుడ్ బడా స్టార్స్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Ram Charan

కేజీఎఫ్ చిత్రంతో సూపర్ హిట్ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్  ప్రభాస్, ఎన్టీఆర్ లతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి సిద్ధమైపోయారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో కూడా ప్రాజెక్ట్ చేయబోతున్నాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ తర్వాత మరో కన్నడ దర్శకుడికి రామ్ చరణ్ డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తతో కన్నడ ఇండస్ట్రీకి బాధ కలుగుతోంది.

ప్రశాంత్  నీల్ శిష్యుడైన దర్శకుడు నర్తన్ డైరెక్షన్ లో హీరో శివరాజ్ కుమార్ మఫ్టీ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేశారు. ఈ చిత్రంతో నర్తన్ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా మొదటి సినిమాతోనే కన్నడంలో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ చిత్రంతో నర్తన్ కు ఎంతో పాపులారిటీ పెరిగింది. ఇక దర్శకుడు నర్తన్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ తో కథకు సంబంధించిన చర్చలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ వార్తతో రామ్ చరణ్ ను టార్గెట్ చేస్తూ మీకు రాజమౌళి, సుకుమార్ వంటి ఎంతో గొప్ప దర్శకులు ఉన్నారు. హిందీ నుంచి ఆఫర్స్ వస్తున్నా వెళ్లకుండా మా కన్నడ దర్శకులతో సినిమాలు చేయడం ఎంతవరకు న్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా చరణ్ ను టార్గెట్  చేస్తూ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు కన్నడ ఇండస్ట్రీ వారు.

రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ డైరెక్షన్లో rc15 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామ్ చరణ్ తన 16వ సినిమాని నర్తన్ డైరెక్షన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమై రామ్ చరణ్ తో చేసిన చిత్రం సక్సెస్ అయినట్లైతే దర్శకుడు నర్తన్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM