Silk Smitha : సిల్క్ స్మిత.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలనం.. గ్లామరస్ పాత్రలు చేస్తూ అప్పటి కుర్రకారుల హృదయంలో స్థానం సంపాదించుకుంది. తన కళ్లతో సిల్వర్ స్క్రీన్‌కే మత్తెక్కించిన గ్లామరస్ యాక్టర్ సిల్క్ స్మిత. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలై సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సినీ కెరీర్ పీక్స్ లో ఉండగా ఓ హీరోతో ప్రేమ విఫలమవడం, కొన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవడం వంటివి సిల్క్ స్మితని డిప్రెషన్‌లోకి నెట్టేశాయి. అప్పట్లో హీరోయిన్ల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేంత క్రేజ్ ఆమెకు ఉండేది. అలా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ తెచ్చుకున్న సిల్క్ స్మిత ఎన్నో కోట్లు సంపాదించింది.
సిల్క్ స్మిత తన సంపాదన పెంచుకోవాలన్న ఆశతో నిర్మాతగా కూడా మారింది. అయితే ఆమె నిర్మాతగా చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆర్థికంగా నష్టపోయింది. ఇలా ఆమె సంపాదించిన ఆస్తులు క్రమక్రమంగా తరుగుతూ వచ్చాయి. చివర్లో ఆమె ఆస్తులు కరిగిపోవడంతో అప్పులు కూడా చేసింది. దీంతో ఆమె అనేక వ్యసనాలకు బానిసయింది. సిల్క్ స్మిత కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెతో సన్నిహితంగా ఉన్న స్టార్ హీరోలు ఎవరురూ సాయం చేయలేదు. చివరకు ఆమె ఎంతో ఇష్టంగా ప్రేమించిన ఓ స్టార్ హీరో సైతం ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు దూరం పెట్టేశాడు. ఇవన్నీ ఇలా ఉంటే ఆమె ఎంతో నమ్మిన ఓ నటుడు చివర్లో ఆమెను దారుణంగా మోసం చేశాడట.
తన ఆత్మహత్య లేఖలో కూడా తనను కొందరు మోసం చేశారని రాసి మరీ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆమెను మోసం చేసింది ఎవరో కాదు.. అప్పట్లో ఓ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండేవాడు. స్మిత కెరీర్ ఫామ్‌లో ఉన్నప్పుడు మాయమాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆమె అతడిని నమ్మి తన ఆస్తుల వివరాలన్నీ చెప్పేసింది. ఆమెను అలా గుప్పెట్లోకి తెచ్చుకుని.. ఆమె మద్యం మత్తులో ఉండగా ఆమె ఆస్తులను తన పేరు మీద రాయించుకున్నాడు. తాను మోసపోయానన్న విషయం స్మితకు చివర్లో కానీ అర్థం కాలేదు. చివరకు అదే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపితమైంది. సిల్క్ స్మిత జీవితాన్ని డర్టీ పిక్చర్ గా డైరెక్టర్ మిలన్ లుథ్రియా తెరకెక్కించారు. ఇందులో విద్యాబాలన్ సిల్క్ స్మిత క్యారెక్టర్ లో నటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…