Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ఈ వార్తతో తమిళ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన వారు ఉలిక్కిపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. అయితే తాజాగా గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
తాజాగా విడుదలైన కమల్ హెల్త్ బులెటిన్‌లో ఆయన పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్లుగా తెలిపారు. డిసెంబర్ 3న ఆయనను డిశార్జ్ చేయనున్నామని.. డిసెంబర్ 4 నుంచి కమల్ తన పనులు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే కరోనా వల్ల కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోని రమ్యకృష్ణ హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా నుండి ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఈ షోలో తిరిగి పాల్గొననున్నారు.
మరోవైపు కమల్ విక్రమ్ అనే చిత్రం చేస్తున్నారు. నగరం, ఖైదీ, మాస్టర్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ డైరెక్టర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు సీనియర్ హీరో కమల్ హాసన్‌తో మూవీ చేస్తున్నాడు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్.మహేంద్రన్‌తో కలిసి కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కమల్ హాసన్ నటిస్తోన్న 232వ చిత్రమిది. ఈ సినిమాలో కమల్ హాసన్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు.
ఇటీవల అమెరికా వెళ్లిన కమల్ తిరిగి వచ్చాక కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. నవంబర్ 22న కమల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అప్పటినుండి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సినీ వర్గాల్లో, అలాగే అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో డిసెంబర్ 1న కమల్‌కు చికిత్సనందిస్తున్న శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ వారు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…