Ananthapuram : వివాహం తర్వాత వధువు ఎన్నో ఆశలతో తన జీవితం ఎంతో అద్భుతంగా, సంతోషంగా ఉండాలని భావించి అత్తారింట్లో అడుగు పెడుతుంది. కానీ ఈ నవవధువు మాత్రం కాళ్ల పారాణి ఆరకముందే అత్తారింటికి కాకుండా అనంతలోకాలకు వెళ్ళింది. ఈ క్రమంలోనే పెళ్లి జరిగిన పది రోజులకే ఆమె ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రంలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..
బుక్కరాయసముద్రం మండలం గ్రామ సచివాలయం 2 లో పని చేస్తున్న సుజన అనే అమ్మాయికి, చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన విశ్వనాథ్ తో నవంబర్ 17వ తేదీన వివాహం జరిగింది. వేదమంత్రాల సాక్షిగా.. బంధు మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహం తరువాత పుట్టింటికి వచ్చిన సుజన గత పది రోజుల నుంచి పుట్టింటిలోనే ఉంటూ విధులకు వెళుతోంది.
ఈ క్రమంలోనే తమ కుటుంబ సభ్యులు ఆమెను అత్తవారింటికి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సోమవారం యథావిధిగా విధులకు వెళ్లి వచ్చిన సుజన అనంతరం బాత్‌రూంలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పెళ్లి అయిన పది రోజులకే ఈమె ఆత్మహత్యకు పాల్పడటంతో కారణాలు ఏమిటని ఆరా తీస్తున్నారు. అయితే తమ కూతురికి తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టమని వారిని విడిచిపోలేకే ఈ విధమైన నిర్ణయం తీసుకుందని.. కుటుంబసభ్యులు తెలియజేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…