Kalakeya : బాహుబలి చిత్రంలో కిలికి భాషను సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసా..?

Kalakeya : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బాహుబ‌లి బిగినింగ్ అండ్ క‌న్‌క్లూషన్ సినిమాలు సినీచరిత్రలో గొప్ప క‌ళాఖండాలు అని చెప్ప‌వ‌చ్చు. తెలుగువారి చిత్రాల సత్తా ఏంటో  ప్ర‌పంచ వ్యాప్తంగా చాటిచెప్పారు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమాను బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌రువాత అని మాట్లాడుకునే విధంగా ట్రెండ్ ని సెట్ చేశారు. ఈ చిత్రాలకు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని క‌చ్చిత‌త్వానికి, సంక్లిష్ట‌తకి మారుపేరుగా చెబుతారు. సినిమాలోని చిన్న చిన్న అంశాల‌ను కూడా ఎంతో విశ్లేష‌ణతో రూపొందిండంలో ఆయ‌న‌కు సరిసాటి మరెవ్వరూ లేరు.

బాహుబలి సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓ అంశం కాలకేయుడు మాట్లాడే కిలికి భాష. కాలకేయుడి రూపం చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుందో.. కాలకేయుడు మాట్లాడిన కిలికి భాష అందరినీ ఆకట్టుకుంది. బాహుబలి సినిమాతో ఈ కిలికి భాష అనేది బాగా హైలైట్ అయింది. మాహిష్మతి సామ్రాజ్యానికి, కాలకేయులకు మధ్య జరిగే మహా యుద్ధానికి ముందు కాలకేయ నాయకుడు ఈ కిలికి భాషలో మాట్లాడతాడు. ఈ భాష బాహుబలి సినిమా టైం లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ భాష చాలా మందికి  అర్ధంకాకపోయినా ఆ భాష కోసమే సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్లేవారు. మరి ఇలాంటి సరికొత్త భాషను సృష్టించిన ఆ వ్యక్తి ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kalakeya

బాహుబలి చిత్రంలో కాలకేయ కోసం కల్పిత భాషని రూపొందించిన కళాకారుడు మధన్ కార్కీ వైరముత్తు. మధన్ కార్కీ వైరముత్తు ఓ స్క్రీన్ రైటర్, లిరిక్స్ రైటర్, ఎంటర్‌ప్రెన్యూర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరియు రీసెర్చ్ అసోసియేట్. 7 సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న గీత రచయిత వైరముత్తు పెద్ద కుమారుడు మధన్ కర్కి. అతను క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. గిండిలోని ఇంజనీరింగ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కార్కి తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన తర్వాత మాటల రచయితగా పని చేయడం ప్రారంభించారు. 2013లో తన అధ్యాపక వృత్తికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో చిత్ర పరిశ్రమలోకి వచ్చేశారు.

ఆ సమయంలోనే కార్కీ రీసెర్చ్ ఫౌండేషన్ అకడమిక్ రీసెర్చ్‌కు మదన్ కర్కి వైరముత్తు పునాది వేశారు. మదన్ కర్కి వైరముత్తు సృష్టించిన కాలకేయ తెగ కిలికి భాషని ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రంలో చూపించారు. సినీ చరిత్రలో ఇలాంటి కల్పిత భాషను ఉపయోగించడం ఇదే తొలిసారి. మదన్ కర్కి వైరముత్తు రూపొందించిన కిలికి భాష కూడా సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, తమిళం మొదలైన భాషల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ భాషలో 10 తమో సంస్కృతం, ఏడు నుండి వినోకు, 3 మోవో తమిళం, 9 నుండి నమో సంస్కృతం భాషల నుండి తీసుకోబడ్డాయి. రెనాల్ట్ తమిళం యొక్క తద్వా రూపం 8 కోసం కనిపిస్తుంది. ఈ భాషకు 12 అచ్చులు, 22 హల్లులు మరియు 5 ఫొనెటిక్ కబుర్లు ఆధారంగా ఉంటాయి.

ఈ భాష కోసం 40 గ్రామర్ రూల్స్ తో కూడిన 750 పదాలను మదన్ కర్కి  కనిపెట్టారు. అంతే కాకుండా బాహుబలి షూటింగ్ స్పాట్లో అందరూ రిఫర్ చేసుకోవడానికి కొన్ని రిఫరెన్స్ డాక్యుమెంట్స్ ని కూడా ప్రిపేర్ చేశారు. కిలికి బాషలోని పదాల‌ను అర్థం చేసుకోవడం, వాటిని పలకడం కష్టంగా ఉంటుందని ఆ పదాలని ఎలా పలకాలి అనేది రికార్డ్ చేసి సెట్స్ కి పంపించారట మదన్ కర్కి. ఇలా కిలికి భాష చాలా పాపుల‌ర్ అయింది.

Share
Mounika

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM