Balakrishna : ఒకే క‌థ‌తో బాక్సాఫీస్ వ‌ద్ద వెంక‌టేష్‌.. బాల‌కృష్ణ పోటీ.. ఎవ‌రు గెలిచారంటే..?

Balakrishna : ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ వెండితెరకు పరిచయమై తన అద్భుతమైన నటనతో ఎన్నో చిత్రాలతో ఘనవిజయం అందుకున్నారు. బాలయ్య బాబుకి అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేవిధంగా నిర్మాత డి.రామానాయుడు సినీ వారసుడిగా కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ అద్భుతమైన నటనతో తనకంటూ ఒక సపరేట్ ట్రెండ్ ను సెట్ చేసుకున్నారు.

అయితే టాలీవుడ్ తోపాటు వివిధ సినీ పరిశ్రమల‌లో సంక్రాంతి, సమ్మర్ స్పెషల్ అంటూ టాప్ హీరోల సినిమాలు థియేటర్ల వద్ద పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా సమ్మర్ స్పెషల్ గా ఒకే రకమైన స్టోరీ లైన్‌లో ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగిన బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలేవో తెలుసా..  బాలకృష్ణ హీరోగా నటించిన అశోక చక్రవర్తి మరియు వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రం ఒకే రోజు దగ్గర దగ్గరగా ఒకే కథాంశంతో ప్రేక్షకులను అలరించడం కోసం థియేటర్ లోకి వచ్చేశాయి.

Balakrishna

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఆర్యన్ సినిమాకు రీమేక్ గా బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ సినిమాను ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమా 1989 జూన్ 29న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో బాలకృష్ణకు జంటగా భానుప్రియ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి గాను ఇళయరాజా సంగీతం అందించారు. అంతేకాదు ఈ సినిమాలో పాటలు అప్పట్లో మ్యూజికల్‌గా హిట్ అయ్యాయి.

ఇక మరోవైపు వెంకటేష్ హీరోగా ధ్రువనక్షత్రం కూడా దాదాపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రమే. ఈ చిత్రానికి వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా దాదాపు మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న ఆర్యన్ సినిమాను ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు. వెంకటేష్ ధ్రువ నక్షత్రం చిత్రం కూడా 1989 జూన్ 29న థియేటర్లలో విడుదలైంది.  ధ్రువ నక్షత్రం చిత్రంలో వెంకటేష్ సరసన రజినీ హీరోయిన్ గా  నటించింది. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. ఈ రెండు చిత్రాలకు ఉన్న మరొక విశేషం ఏంటంటే.. మాటల రచయితలుగా పరుచూరి బ్రదర్స్ పనిచేయటం.

మొత్తంగా ఒక తరహా కథతో వచ్చిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం, వాటికి మాటలు రాసిన రచయతలు కూడా ఒకరే కావడం మరో విచిత్రమనే చెప్పాలి. సమ్మర్ స్పెషల్ గా బాక్సాఫీస్ బరిలో దిగిన ఇద్దరి సినిమాలలో వెంకటేష్ నటించిన ధృవనక్షత్రం సినిమా సూపర్ హిట్ ను అందుకోగా, బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి బాక్సాఫీస్ బరిలో యావరేజ్‌ టాక్ తో సరిపెట్టుకుంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM