SS Rajamouli : రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ కాంబినేషన్‌తో సినిమా నిర్మించడానికి నిర్మాత కె.ఎల్.నారాయణ ప్లాన్ చేశారు. ఇన్నాళ్లకు కానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఈ చిత్రం పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ చిత్రం పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. కథకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తికాగానే రాజమౌళితో మూవీ స్టార్ట్ చేస్తాడు మహేష్.
రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు కథలు సిద్ధం చేసినట్లు, అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ, జేమ్స్‌బాండ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ గా ఓ కథ అనుకున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తన తదుపరి సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు.
మహేశ్‌తో చేసే సినిమా గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వంచర్ అని చెప్పాడు. అంటే ప్రపంచాన్ని చుట్టివచ్చే ఒక సాహసవంతుని కథగా ఈ సినిమా ఉండబోతోందన్న మాట. గతంలో ఎంజీఆర్ లోకం చుట్టిన వీరుడు అనే సినిమా చేశారు. పక్కా యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ఉంటుంది. ఇందులో మహేశ్ నుంచి ఎవరూ ఊహించని ఎలిమెంట్స్ ఉంటాయి అని రాజమౌళి చెప్పాడు.
రాజమౌళి సినిమా కోసం మహేశ్ కూడా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాడు. ఆయనతో ఒక సినిమా చేస్తే 25 సినిమాలు చేసినట్లే అని ఓ ఇంటర్వ్యూలో మహేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రాజమౌళితో సినిమా ప్రారంభమే కానీ ముగింపు ఎప్పుడో చెప్పలేము అనేదానిపై రకరకాల మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా మొత్తానికి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే చాలు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…