Childhood Photo : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి చిన్నది ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్. చూడడానికి అచ్చతెలుగమ్మాయిలా కనిపిస్తుంది. కానీ మళయాళీకి చెందిన ముద్దుగుమ్మ. ఈమె తండ్రి యాక్టర్ మరియు ప్రొడ్యూసర్. అంతేకాదు ఈమె తల్లి తెలుగులో చిరంజీవితో పున్నమినాగు సినిమాలో నటించింది. తెలుగులో అవకాశాలు రాకపోవడం వల్ల దక్షిణాదిలో వేరే భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మళయాళం అనే తేడా లేకుండా చిత్రాలు చేస్తూ మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత హీరో హీరోయిన్స్ తమ త్రో బ్యాక్ పిక్చర్స్ తో అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ పోస్ట్ చేసిన తన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల మహేష్ బాబుతో నటించి తన గ్లామర్ తో కుర్రకారు మతులు పోగొట్టేసింది. ఇంతకీ ఎవరు ఈ హీరోయిన్ అని ఆలోచిస్తున్నారా.. ఆమె ఇంకెవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్.
ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను అందుకుని ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ఆ పాత్రకు జీవం పోసింది కీర్తి సురేష్. మహానటి చిత్రానికి గాను నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. ఆ తర్వాత కీర్తి నటించిన మన్మథుడు 2, గుడ్ లక్ సఖి, రంగ్ దే చిత్రాలు ఆశించిన మేరకు విజయాలు సాధించలేకపోయాయి. ఇటీవల మహేష్ బాబు తో నటించిన సర్కారు వారి పాట చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటూ తన లేటెస్ట్ గ్లామరస్ లుక్ తో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ చూసేవారికి కనుల విందు చేస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…