Kajal Aggarwal : త‌ల్లి కాబోతున్న కాజ‌ల్‌.. త్వ‌ర‌లోనే అనౌన్స్‌మెంట్ అని ప్ర‌క‌టించిన చంద‌మామ‌..

Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కాజ‌ల్ కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే పెళ్లి చేసుకుంది. 2020 అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. ఆ తరువాత ఎక్కువ సమయం తీసుకోకుండా భర్తతోపాటే షూటింగులకు కూడా వచ్చేసింది. ప్ర‌స్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఘోస్ట్ లోనూ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నిర్మాతగాను మారి ‘మను చరిత్ర’ అనే సినిమాను నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ త్వ‌ర‌లో త‌ల్లి కాబోతుంది అంటూ కొద్ది రోజులుగా ప్ర‌చారం న‌డుస్తోంది. ఇటీవలే కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా తన అక్క తల్లి కావాలని కోరుకుంది. ఈ క్ర‌మంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఉన్నట్లు చెబుతూ.. వేచి ఉండాలని కూడా సింపుల్ గా ఒక లైన్ లో పోస్ట్ పెట్టేసింది. వాటి అర్థం ఏమిటి ? అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా లవ్ సింబల్ తో పాటు డాన్స్ చేస్తున్న ఎమోజీ ని కూడా జత చేసింది.

చూస్తుంటే కాజల్ అగర్వాల్ తన పర్సనల్ లైఫ్ లో ముఖ్య విష‌యం చెప్ప‌బోతున్న‌ట్టుగా తెలుస్తుంది. అది కూడా తాను త‌ల్లి కాబోతున్న విష‌య‌మే అంటున్నారు. అక్టోబ‌ర్ 30న కాజ‌ల్ త‌న వెడ్డింగ్‌ యానివ‌ర్సరీ జ‌రుపుకోనున్న నేప‌థ్యంలో ఆలోపే క్రేజీ అప్‌డేట్‌ ఇవ్వాల‌ని భావిస్తుంద‌ట ఈ ముద్దుగుమ్మ‌. 2004 లో ఒక హిందీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మూడేళ్లకు 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ అసలు వెనక్కి తిరిగి చూడలేదు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM