Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కాజల్ కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. 2020 అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. ఆ తరువాత ఎక్కువ సమయం తీసుకోకుండా భర్తతోపాటే షూటింగులకు కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఘోస్ట్ లోనూ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నిర్మాతగాను మారి ‘మను చరిత్ర’ అనే సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతుంది అంటూ కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది. ఇటీవలే కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా తన అక్క తల్లి కావాలని కోరుకుంది. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఉన్నట్లు చెబుతూ.. వేచి ఉండాలని కూడా సింపుల్ గా ఒక లైన్ లో పోస్ట్ పెట్టేసింది. వాటి అర్థం ఏమిటి ? అనేది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా లవ్ సింబల్ తో పాటు డాన్స్ చేస్తున్న ఎమోజీ ని కూడా జత చేసింది.
చూస్తుంటే కాజల్ అగర్వాల్ తన పర్సనల్ లైఫ్ లో ముఖ్య విషయం చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా తాను తల్లి కాబోతున్న విషయమే అంటున్నారు. అక్టోబర్ 30న కాజల్ తన వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోనున్న నేపథ్యంలో ఆలోపే క్రేజీ అప్‌డేట్ ఇవ్వాలని భావిస్తుందట ఈ ముద్దుగుమ్మ. 2004 లో ఒక హిందీ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మూడేళ్లకు 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ అసలు వెనక్కి తిరిగి చూడలేదు.