Points Table IPL 2021 : ప్రతి సీజన్‌లోనూ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో గడ్డు పరిస్థితి వచ్చింది. ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలను ముంబై ఇంకా సంక్లిష్టం చేసుకుంది. అయితే ఇందులో ముంబై ప్రమేయం ఏమీ లేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఎప్పుడైతే రాజస్థాన్‌పై 86 పరుగుల భారీ తేడాతో గెలిచిందో.. అప్పుడే ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్‌కతా జట్టు ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో +0.587 నెట్ రన్ రేట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.
అయితే కోల్‌కతా అంతటి భారీ విజయం సాధించడంతో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సన్నగిల్లిపోయాయి. ఈ క్రమంలోనే ఇంకో మ్యాచ్‌లో రోహిత్ శర్మ సేన ముందుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టుపై 171 పరుగుల తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ముంబై ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు పూర్తిగా క్లోజ్ అయ్యాయనే చెప్పవచ్చు.
ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో 20 పాయింట్లతో ఆడిన 13 మ్యాచ్‌లలో 10 గెలిచి ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉంది. తరువాత 9 విజయాలతో 18 పాయింట్లతో చెన్నై రెండో స్థానంలో ఉంది. 8 విజయాలు, 16 పాయింట్లతో బెంగళూరు మూడో స్థానంలో ఉండగా.. 7 విజయాలు, 14 పాయింట్లతో కోల్‌కతా 4వ స్థానంలో ఉంది. అలాగే పంజాబ్, ముంబై, రాజస్థాన్, హైదరాబాద్‌లు వరుస స్థానాల్లో నిలిచాయి.
ఇక ఆరెంజ్ క్యాప్ నిన్న మొన్నటి వరకు డుప్లెసిస్ వద్ద ఉండగా.. కేఎల్ రాహుల్ అద్భుతమై 98 పరుగులతో ఆ క్యాప్‌ను తాను సొంతం చేసుకున్నాడు. అలాగే ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లలో 29 వికెట్లు తీసిన ఆర్‌సీబీ పేసర్ హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్‌ను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ సమీపిస్తుండగా.. ఏ జట్టు ఫైనల్ కు చేరి ట్రోఫీని లిఫ్ట్ చేస్తుందా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…