Kajal Aggarwal : టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న తరువాత కూడా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా మెగాస్టార్ సరసన ఆచార్య మూవీలో నటించింది. అయితే ఇటీవల కాజల్ అగర్వాల్ ఓ సర్ ప్రైజ్ న్యూస్‌ను అనౌన్స్ చేస్తానని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీస్ ద్వారా తెలిపింది.
కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అయిందని, అందుకనే ఆ విషయాన్ని తెలియజేస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఆమె ఇంకా స్పష్టతను ఇవ్వలేదు. కానీ వేచి చూడాలని మాత్రం చెప్పింది. అయితే కాజల్ అగర్వాల్ సినిమాల నుంచి తప్పుకుంటుందని, ప్రెగ్నెన్సీ వల్లే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని, ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్‌ఫాం చేయడంతోపాటు సినిమాల్లో నటించబోననే విషయాన్ని కూడా ఆమె వెల్లడిస్తుందని తెలుస్తోంది. అందుకనే ఆమె ఇన్‌స్టాలో ఆ విధంగా పోస్ట్ పెట్టి ఉంటుందని అనుకుంటున్నారు.
అయితే మరో వైపు కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల నుంచి కూడా తప్పుకోవాలని భావిస్తుందట. ప్రెగ్నెన్సీ వల్లే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే ఆమె ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేయలేదు. దాన్ని సస్పెన్స్‌లో పెట్టింది. ఒక సర్‌ప్రైజ్ ఉంటుందని మాత్రం చెప్పింది. అయితే ఆ సర్‌ప్రైజ్ ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రెగ్నెన్సీ అనే సర్‌ప్రైజ్‌తోపాటు తాను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఇంకో సర్‌ప్రైజ్‌ను కాజల్ అగర్వాల్ అనౌన్స్ చేస్తుందా ? లేదా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.