Sreemukhi : బుల్లితెర టాలెంటెడ్ యాంకర్ శ్రీముఖి ప్రోఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ లోనూ దూసుకుపోతోంది. ఈ వేగాన్ని మరింత పెంచేందుకు బ్రాండెడ్ కార్ ని సొంతం చేసుకుంది. సినిమాల్లో కూడా నటిస్తూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 4 లో వన్ ఆఫ్ ద రన్నరప్ గా నిలిచింది. దాంతో మరింత క్రేజ్ ని సంపాదించుకుంది. రీసెంట్ గా నితిన్ హీరోగా నటించిన మాస్ట్రోలో ఓ కీలక పాత్ర పోషించి మరింత గుర్తింపు తెచ్చుకుంది.
మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసి నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా సొంత ఇల్లుని కట్టుకుని గృహ ప్రవేశం చేసిన శ్రీముఖి లేటెస్ట్ గా ఫోర్డ్ కారుని సొంతం చేసుకుంది. కెరీర్ లో సెటిల్ అయ్యాక తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని శ్రీముఖి ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పింది. తన బ్రదర్ తో కలిసి కారు ముందు నుంచుని ఉన్న ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.
https://www.instagram.com/p/CUzhzASpBis/
ఎట్టకేలకు తాను అనుకున్నట్లు లైఫ్ ని లీడ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని చాలా సార్లు తన అభిమానులతో షేర్ చేసుకుంది శ్రీముఖి. ఈమెకు కొత్త కారు కొనుకున్నందుకు కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు. శ్రీముఖి ప్రస్తుతం కెరీర్ లో సూపర్ సక్సెస్ తో ఫుల్ బిజీగా ఉంది. అటు సినిమాలతోపాటుగా ఇటు టీవీ షోస్ లోనూ.. ఈవెంట్స్ కూడా చేసుకుంటూ సందడి చేస్తోంది. బుల్లితెర ప్రేక్షకుల్ని తన యాంకరింగ్ తో మెస్మరైజ్ చేస్తోంది.