Kaikala Satyanarayana : కైకాల సత్యనారాయణ టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 750 కి పైగా సినిమాలు చేసి తెలుగు సినీ ఇండస్ట్రీకి దొరికిన ఓ గొప్ప నటుడు అనే చెప్పాలి. విలన్ గా, తండ్రిగా, తాతగా వివిధ రకాల పాత్రలలో తన అద్బుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కైకాల కెరీర్ ప్రారంభంలో సీనియర్ ఎన్టీఆర్ కి డూప్ గా నటించేవారు. ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయంలో కనిపించిన చాలా సినిమాల్లో సత్యనారాయణ నటించారు.
కైకాల సత్యనారాయణలో మంచి నటుడు ఉన్నాడని గుర్తించి ఎన్టీఆర్ అపూర్వ సహస్ర సచ్ఛరిత్ర అనే సినిమాలో సత్యనారాయణకు ఓ పాత్రలో అవకాశం ఇప్పించారు. ఇక అప్పటి నుంచి తన నటనతో కైకాల సత్యనారాయణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడిగా, లవకుశలో భరతుడిగా, నర్తనశాలలో దుశ్సాసనుడిగా, శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఘటోత్కచుడిగా, యమలీల చిత్రంలో యముడిగా విభిన్నమైన పౌరాణిక పాత్రల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
కైకల సత్యనారాయణ 1935 సంవత్సరం 25 జులై లో కృష్ణాజిల్లాలోని కవుతారం అనే గ్రామంలో జన్మించారు. ఆయన స్కూల్ చదువును గుడ్లవల్లేరు అనే గ్రామంలో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ చదువును విజయవాడలో మరియు గ్రాడ్యుయేషన్ ను గుడివాడ కాలేజీ నుంచి పూర్తి చేశారు. వీరి వంశంలో మొట్టమొదటి సారి డిగ్రీ సంపాదించిన వ్యక్తి సత్యనారాయణ మాత్రమే. ఎన్టీఆర్ తో 1977లో అడవిరాముడు సినిమాలో నటించడమే కాకుండా ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అడవిరాముడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
కైకాల సత్యనారాయణ యమధర్మరాజు పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తారు. నిజానికి యముడంటే ఇలాగే ఉంటాడు అనే విధంగా ఉంటుంది సత్యనారాయణ నటన. యుముడి పాత్రలో కైకాల యమగోల, యముడికి మొగుడు, యమలీల వంటి సినిమాల్లో అద్బుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కైకాల సత్యానారాయణ శ్రీకాంత్ హీరోగా యమగోల మళ్లీ మొదలైంది. రవితేజ హీరోగా వచ్చిన దరువు సినిమాల్లో సీనియర్ యముడిగా కనిపించారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో నటించారు. బాలకృష్ణ కోరిక మేరకు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ప్రముఖ దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి పాత్రలో కనిపించారు. అంతేకాకుండా కైకాల సత్యనారాయణ కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…