Balakrishna And Nagarjuna : వెండితెరపై ఎన్ని రకాలు చిత్రాలు వచ్చిన కూడా మల్టీస్టారర్ చిత్రాలని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. ఎందుకంటే ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసినట్లు ఇద్దరు స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటానికి అభిమానులు బాగా ఆసక్తి చూపుతారు. ఇలా అభిమానులు ఇష్టపడే మల్టీస్టారర్ చిత్రాలు టాలీవుడ్ లో ఎన్నో వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలోనే టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా అప్పటిలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తున్నారు అంటే చాలు అభిమానులు పండగ చేసుకునేవారు.
ఆ తర్వాత కాలంలో నందమూరివారి నటవారసుడిగా బాలకృష్ణ, ఏఎన్ఆర్ నటవారసుడిగా నాగార్జున హీరోలగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో బాలకృష్ణ మరియు నాగార్జున కాంబినేషన్ లోనూ మల్టీస్టారర్ రావాలని అభిమానులు కోరుకున్నారు. ఇక ఏఎన్నార్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన గుండమ్మ కథ సినిమాను మరోసారి కథలో మార్పులు చేసి బాలకృష్ణ, నాగార్జునలతో తెరకెక్కించాలని అప్పటిలో ప్రయత్నాలు జరిగాయి. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.
ఆ తర్వాత మరో ప్రయత్నంగా మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమాను బాలకృష్ణ, నాగార్జునలతో రీమేక్ చేయాలని కూడా ప్రయత్నాలు జరిగాయట. ఈ సినిమా కోసం నిర్మాత సురేష్ బాబు వీరిద్దరిని ఒప్పించడం కూడా జరిగిందట. ఈ సినిమాకు బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవడంతో నాగార్జున, బాలయ్యల మధ్య సఖ్యత లేదనే వార్తలు వినిపించాయి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో రావలసిన మరో సినిమా కూడా ఆగిపోయింది. ఇక 1999లో ఎన్టీఆర్ మరో వారసుడు హరికృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో సీతారామరాజు సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పటిలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో నందమూరి మరియు అక్కినేని అభిమానుల కల నెరవేరింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…