Arya Movie : పుష్పతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. మొదట లెక్కల మాస్టర్ గా ఉన్న సుకుమార్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ప్రారంభించి, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టి పడేసే స్థాయికి ఎదిగాడు. తన మొదటి సినిమా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్యతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు సుకుమార్. 4 కోట్లు పెట్టి తీసిన సినిమా 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను హీరోగా నిలబెట్టిన చిత్రం ఆర్య. అయితే ఈ చిత్రానికి ముందు ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.
ఇక సుకుమార్ దిల్ రాజు నిర్మించిన దిల్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఈ సినిమా సమయంలో దిల్ రాజు సుకుమార్ లోని కసిని పసిగట్టాడట. అంతే కాకుండా దిల్ సినిమా హిట్ అయితే నీకు ఆఫర్ ఇస్తా.. కథ రెడీ చేసుకో అంటూ బంపరాఫర్ ఇచ్చాడట. దిల్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో సకుమార్ ను ఆఫీస్ కు పిలిపించుకుని కథ నచ్చింది. మనం సినిమా చేద్దామని హామీ ఇచ్చాడట. హీరోని వెతికే పనిలో మొదటగా రవితేజ, నితిన్, ప్రభాస్ లకు కథను వినిపించాడట. కానీ ఆ ముగ్గురు కూడా ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారు.
ఆ తరవాత కొత్తవాళ్లతో చేస్తే బాగుంటుందేమోనని అనుకున్నాడట. ఇక అప్పుడే గంగోత్రితో అల్లు అర్జన్ హీరోగా పరిచయం అయ్యాడు. అల్లు అర్జున్ ను చూసిన సుకుమార్ తన కథలో బన్నీనే హీరో అనుకుని దిల్ రాజుకు చెప్పాడట. ఇక దిల్ రాజు వెంటనే బన్నీని ఆఫీస్ కు పిలిచి సుకుమార్ చేత కథ వినిపించాడట. దాంతో అల్లు అర్జున్ గంగోత్రి తరవాత 96 కథలు విన్నాను అన్నీ రోటీన్ కథలు అంటూ నీరసంగా చెప్పాడట. దిల్ రాజు మాది డిఫరెంట్ కథ నీకు నచ్చుతుందని చెప్పడంతో సరేనని కథ విన్నాడట. ఆ తరవాత కొన్ని మార్పులు చేర్పులతో ఆర్య సినిమాను పట్టాలెక్కించారు. ఇక ఈ సినిమా సక్సెస్ తో సుకుమార్ క్రియేటివ్ డైరెక్టర్ గా మారగా, బన్నీ స్టార్ గా ఎదిగాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…