JioPhone Next : టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. ఈ ఏడాది జూన్‌లోనే జియోఫోన్ నెక్ట్స్ పేరిట అత్యంత చవక ధరకు ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను అందిస్తామని ప్రకటన చేసింది. గూగుల్‌తో కలిసి ఆ ఫోన్‌ను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపింది. అయితే షెడ్యూల్ ప్రకారం జియోఫోన్ నెక్ట్స్ ఫోన్‌ను సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్బంగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ చిప్‌ల కొరత కారణంగా ఈ ఫోన్ విడుదల దీపావళికి వాయిదా పడింది.
ఈ క్రమంలోనే జియోఫోన్ నెక్ట్స్ ఫోన్‌ను దీపావళికి లాంచ్ చేయనున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. అయితే ఈ ఫోన్‌లో అందించనున్న ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) గురించి జియో ప్రకటించింది. దీంట్లో ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ప్రగతి ఓఎస్‌ను ఆండ్రాయిడ్ ఆధారంగా ప్రత్యేకంగా రూపొందించారు. కేవలం జియోఫోన్ నెక్ట్స్ కోసం మాత్రమే ఈ ఓఎస్‌ను గూగుల్ తీర్చిదిద్దింది.
ప్రగతి ఓఎస్ భారతీయులకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్ అలౌడ్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, ఏఆర్ ఫిల్టర్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇక జియో, గూగుల్ యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తారు.
జియోఫోన్ నెక్ట్స్ ఫోన్‌లో 5.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ (క్వాల్ కామ్ 215 చిప్‌సెట్), డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు.. వంటి ఫీచర్లను అందివ్వనున్నారని ఇదివరకే లీక్‌ల ద్వారా తెలిసింది. ఈ ఫోన్‌ను రూ.3,300 కే అందించనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ను ఏపీలోని తిరుపతిలో, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో నియోలింక్ సొల్యూషన్స్ అనే సంస్థ ఉత్పత్తి చేస్తోంది. అయితే దీపావళి రోజున అయినా ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తారా ? ఏమైనా ఆటంకాలు వస్తాయా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…