Puri Jagannadh : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరనే విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ అనే చిత్రం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది.
గత కొద్ది రోజులుగా లైగర్ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే పూరీ, ఛార్మీలు కారులో ప్రయాణిస్తుండగా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వారి కారు ఆగింది. టీఎస్ వాహనం చూసి, మన తెలుగు వాళ్ళు అని అనుకున్న ప్రమోద్ అనే అభిమాని పూరీని ఆప్యాయంగా పలకరించాడు. ఆనందం తట్టుకోలేక కన్నీరు కూడా పెట్టుకున్నాడు. తన దగ్గర ఫోన్ లేకపోవడం తో సెల్ఫీ తీసుకోవడం కుదరలేదు.. అంటూ చెప్పుకొచ్చాడు.
వెళుతూ వెళుతూ ఛార్మీని ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయమని కోరాడు. దీంతో ఛార్మి ప్రమోద్‌కి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ముంబై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ క్యూట్ కిడ్ పూరీని కలిశాడు. ఈ పోస్ట్ స్పెషల్‌గా ప్రమోద్ కోసమే. పూరీతో సెల్ఫీదిగడానికి తన దగ్గర ఫోన్ లేదని చెప్పాడు. అందుకే నా సోషల్ మీడియాలో షేర్ చేశానని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…