టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కొత్త స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్‌ను ఇటీవలే దీపావళి సందర్బంగా భారత మార్కెట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు ఈ ఫోన్‌ను కేవలం ప్రీ ఆర్డర్‌ల ద్వారా లేదా వాట్సాప్ లేదా జియో వెబ్‌సైట్ ద్వారా ముందుగా రిజిస్టర్ చేసి కొనుగోలు చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
జియో నెక్ట్స్ ఫోన్‌ను ఇకపై వినియోగదారులు నేరుగా రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్ ద్వారా సులభంగానే కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో ఈ ఫోన్‌ను కొనేందుకు ఇకపై ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన పనిలేదు. వెంటనే కొనుగోలు చేయవచ్చు. అయితే ఫోన్‌ను కొనేందుకు గాను పూర్తి చెల్లింపు ముందుగానే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి క్యాష్ ఆన్ డెలివరీ సౌలభ్యాన్ని అందించడం లేదు.
ఇక ఎవరైనా గ్రామ ప్రజలు ఈ ఫోన్ ను బుక్ చేస్తే వారు తమకు దగ్గరలో ఉండే జియో స్టోర్ కి వెళ్లి ఫోన్‌ను తీసుకోవచ్చు. కాగా జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్‌లో.. 5.45 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ క్యూఎం 215 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, మెమొరీని 512 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 13 మెగాపిక్సల్ కెమెరా వెనుక, 8 మెగాపిక్సల్ కెమెరా ముందు, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.6,499గా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…