మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దాదాపుగా 35 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ దసరా రోజు ఇంటికి చేరుకున్నాడు. దీపావళి రోజు మెగా హీరోలు అందరితో కలిసికట్టుగా ఫొటో దిగి మెగా అభిమానులకి అదిరిపోయే ట్రీట్ అందించాడు. ఇక సాయి ధరమ్ ఇంతకు ముందులా మళ్లీ ఎప్పుడు పలకరిస్తాడా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు.
నవంబర్ 26న రిపబ్లిక్ సినిమా జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు వాయిస్ మెసేజ్ పంపించాడు తేజూ. ఈ మెసేజ్‌కు ముందు రిపబ్లిక్ సినిమాలోని ఓ సీన్‌ను జోడించారు. అనంతరం సాయితేజ్ ఆడియో మెసేజ్ ఉంది. నేను మీ సాయిధరమ్ తేజ్.. మీరు నా మీద చూపించిన ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.. నా ఆరోగ్యంపై మీరు చూపించిన శ్రద్ధ ఎప్పటికీ మర్చిపోలేను.. రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకపోయాను.
కానీ ఇప్పుడు నవంబర్ 26న ఈ సినిమా జీ 5లో విడుదల అవుతోంది. ఈ సినిమాను చూసి మీ అభిప్రాయాలు నాకు తెలపండి అంటూ వాయిస్ మెసేజ్ పంపించాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అక్టోబర్ 1న విడుదలైన రిపబ్లిక్ దాదాపుగా 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతోంది.
ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనపై చూపించిన ప్రేమ, కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సాయితేజ్ పేర్కొన్నారు. రిపబ్లిక్ సినిమాను థియేటర్‌లో మీతో కలిసి చూడలేకపోయానని, కానీ ఆ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదల అవుతోందని పేర్కొన్నారు. సినిమాను చూసి స్పందించాలని కోరిన సాయితేజ్ చివర్లో జై హింద్ అని ముగించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…