Samantha : సమంత, నాగచైతన్యలు విడిపోయాక ఇప్పుడు వారి విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చాలా మంది రకరకాలుగా స్సందిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ మద్దతుదారులు అయితే పీడ విరగడ అయింది.. అంటున్నారు. అయితే ఇప్పుడు సమంతకు రావల్సిన భరణంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
సమంత, నాగచైతన్య పెళ్లికి ముందు ప్రీ మారిటల్ అగ్రిమెంట్ చేసుకున్నారట. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా విడిపోతే భరణం లాంటిది అడగకుండా ముందే అగ్రిమెంట్ చేసుకోవడం అన్నమాట. అయితే ఇప్పుడు ఎలాగూ విడాకులు అయిపోయాయి కనుక ముందే చేసుకున్న ప్రీ మారిటల్ అగ్రిమెంట్ ప్రకారం.. సమంతకు చైతన్య భరణం ఇవ్వాల్సిన పనిలేదన్నమాట.
ఇక చట్ట ప్రకారంగా చూసినా సమంతకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. భర్త నుంచి విడిపోయిన మహిళకు ఎలాంటి ఆధారం లేకపోయినా, జీవించడం కష్టంగా ఉన్నా.. అలాంటి స్థితిలో భరణం అడగవచ్చు. కానీ సమంత అటు సినిమాల్లో, ఇటు యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తోంది. కనుక ఆమె చట్ట ప్రకారంగా చూసినా భరణం ఇవ్వాల్సిన పనిలేదు.