iPhone : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్ ఎస్ఈ 2020 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో అత్యంత చవక ధరకు వినియోగదారులకు లభిస్తోంది. ఈ ఫోన్‌కు చెందిన 64జీబీ బేస్ వేరియెంట్‌పై భారీ తగ్గింపు ధరను అందిస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.39,900 ఉండగా దీన్ని రూ.25,999 కు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను ఆ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఇక ఐఫోన్ ఎస్ఈ 2020 ఫోన్‌కు చెందిన 128జీబీ మోడల్ ధర రూ.30,999 ఉండగా, 256జీబీ మోడల్ ధర రూ.40,999గా ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌లకు చెందిన క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కొన్ని ఇతర బ్యాంకులు కూడా ఈ ఫోన్‌పై రూ.1000 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నాయి.
ఇక ఎక్స్‌చేంజ్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కొంటే గరిష్టంగా రూ.15వేలు ఇస్తారు. ఇది ఎక్స్‌ఛేంజ్ చేయబడే ఫోన్‌ను బట్టి ఉంటుంది. ఐఫోన్ 7 ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే మరో రూ.7వేలు తగ్గింపు వస్తుంది. దీంతో ఫోన్ రూ.18వేలకు లభిస్తుంది. ఈ ఫోన్‌కు చెందిన బ్లాక్, రెడ్, వైట్ కలర్ వేరియెంట్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇంకా ఎన్నో అద్భుతమైన ఆఫర్లను అందించనున్నారు. ఇక ఐఫోన్ ఎస్ఈ 2020 ఫీచర్ల విషయానికి వస్తే 4.7 ఇంచ్ డిస్‌ప్లే, యాపిల్ ఎ13 ప్రాసెసర్ వంటి సదుపాయాలు ఉన్నాయి.