Mohan Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్థానం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన హీరోగా, విలక్షణ నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా మోహన్ బాబు ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన సినీ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, అవమానాలను, కష్టాలను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి రాకముందు మోహన్ బాబు ఒక స్కూల్‌లో డ్రిల్ మాస్టర్ గా పనిచేసేవారని, నెలకు 140 రూపాయల జీతంతో పని చేశానని, కొన్ని కారణాల వల్ల తనను ఆ ఉద్యోగంలో నుంచి తీసేసిన తర్వాత సినిమాల్లో నటించాలన్న ఆశ కలిగి అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతూ అవకాశాలను వెతుక్కోవచ్చని ఇండస్ట్రీ లోకి వచ్చినట్లు ఈ సందర్భంగా మోహన్ బాబు తెలియజేశారు.
ఈ క్రమంలోనే ప్రభాకర్ రెడ్డి తనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అవకాశం ఇప్పించారని తెలిపారు. ఇలా ఆరు నెలలు అసిస్టెంట్ డైరెక్టర్ గా తనతో పని చేయించుకుని కేవలం 50 రూపాయలు జీతం ఇచ్చినట్లు ఈ సందర్భంగా మోహన్ బాబు తెలియజేశారు. అయితే తనని అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయం చేసిన ప్రభాకర్ రెడ్డి తనను హీరోగా పెట్టి గృహప్రవేశం సినిమా తీస్తే ఆ సినిమా ఏకంగా 25 వారాలు ఆడిందని అలా తనకి తనకు మంచి పరిచయం ఏర్పడిందని.. ఈ సందర్భంగా మోహన్ బాబు తెలియజేశారు.