ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న తన కుమారుడి పెళ్లిలో చిన్నప్పుడు తప్పిపోయిన తన కూతురు కనిపించడంతో ఎంతో ఆనందంతో పొంగి పోయింది ఆ తల్లి. అయితే స్వయానా తన కొడుకుతో జీవితం పంచుకున్న అమ్మాయి తన కూతురని తన చేతికి ఉన్న పుట్టు మచ్చ ద్వారా గుర్తించింది. చైనాలోని జియాంగ్సు ప్రావియన్స్‌లో మార్చి 31న జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కూతురే తన కోడలుగా అడుగుపెట్టడంతో ఆ కూతురు ఆనందం అంతా ఇంతా కాదు.తన చేతికి ఉన్న పుట్టుమచ్చ ఆధారంగా తప్పిపోయిన తన కూతురేనని భావించి ఆమె తల్లి తల్లిదండ్రులను ప్రశ్నించగా వారు చిన్నప్పుడు రోడ్డుపై ఒంటరిగా కనిపించడంతో తెచ్చుకొని పెంచిపెద్ద చేసినట్లు తెలిపారు. అయితే ఆ తప్పిపోయిన పాప తన కూతురని గుర్తించిన ఆ తల్లి కూతురి ఆనందానికి అవధులు లేవు.
కానీ తన కూతురిని తన కొడుకు పెళ్లి చేసుకోవడంతో అన్నా చెల్లెలు పెళ్లి బంధం ఒక్కటయ్యారని అందరూ కలత చెందగా ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెళ్ళికొడుకు తల్లిదండ్రులు అసలు విషయాన్ని బయటపెట్టారు. పెళ్లి కొడుకు తమ కొడుకు కాదని, తన కూతురు చిన్నప్పుడు తప్పిపోవడం ఈ అబ్బాయిని దత్తత తీసుకున్నట్లు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు తెలిపారు. వారిద్దరూ ఒకే కడుపున పుట్టక పోవడంతో వారి వివాహానికి ఏ సమస్య లేదని ఎంతో ఘనంగా వారి పెళ్లిని నిర్వహించారు.