కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు టీకా వేయించుకున్నప్పటికీ డబుల్ మాస్కు ధరించి బయటకు వెళ్లాలని అధికారులు తెలియజేస్తున్నారు. కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం రెండు డోస్ ల టీకా వేయించుకున్న వారు ఇకపై మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది.
కరోనా టీకా రెండు డోసులు వేయించుకున్న వారు ఇకపై మాస్కు ధరించకుండా అన్ని బహిరంగ కార్యాలలో పాల్గొనవచ్చని భౌతిక దూరం కూడా పాటించాల్సిన అవసరం లేదని సీడీసీ డైరెక్టర్ రోచెల్లీ వాలెన్‌స్కీ పేర్కొన్నారు. సీడీసీ నిర్ణయం పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకునే వారు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకునే వరకు తప్పకుండా మాస్కులు ధరించాలనీ బైడెన్ తెలిపారు.రైళ్లు, విమానాలు, బస్సుల్లో ప్రయాణించినప్పుడు మాస్క్ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సీడీసీ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.