ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితమయ్యారు. ఖాళీ సమయంలో కొందరు వారి సమయాన్ని వృధా చేస్తుండగా.. మరికొందరు మాత్రం కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు వంటలు చేయడం నేర్చుకోగా, మరికొందరు తమలో ఉన్న సృజనాత్మకతను బయట పెడుతున్నారు.
తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కూడా రెండవ క్యాటగిరి అని చెప్పవచ్చు కరోనా ఖాళీ సమయంలో గరిట చేతపట్టి అద్భుతమైన చాక్లెట్ కేక్‌ని తయారు చేసి నోరూరిస్తోంది ఈ గోవా బ్యూటీ. ఇలియానా స్వయంగా తయారు చేసిన హాట్ హాట్ కేక్‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలియానా తాను స్వయంగా తయారు చేసిన చాక్లెట్ కేక్ ఫోటో షేర్ చేయడమే కాకుండా ఇది నాకు ప్రత్యామ్నాయ కెరీర్ అవుతుందని భావిస్తున్న అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక సినిమాల విషయానికొస్తే ఇలియానా ది బిగ్ బుల్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఇలియానా త్వరలో అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ సినిమాతో సందడి చేయనుంది.