కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ మహమ్మారి రెండవ దశలో తీవ్రరూపం దాలుస్తోంది. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం అధికారులు అన్ని చర్యలు చేపట్టినప్పటికీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ చైనాలో పుట్టి ఇతర దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.కానీ చైనీయులు మాత్రం కరోనా వైరస్ తమకేమి పట్టనట్టుగా తిరుగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు తెలియజేస్తున్నప్పటికీ చైనీయులు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం ప్రజలను వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లను ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుడ్లు ఫ్రీ అంటే జనాలు అక్కర్లేదన్నారు.స్టోర్ కూపన్లు ఫ్రీ ,రేషన్ పై డిస్కౌంట్లు,షాపింగ్ మాల్స్, ప్రార్థనాలయాల్లో సైతం ఆఫర్లు ప్రకటిస్తున్న అప్పటికీ జనాలు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. చైనాలో 119 కోట్లమంది జనాభా ఉండగా కేవలం ఇప్పటివరకు 19 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయడం గమనార్హం