ఎంఐ 11 అల్ట్రాను త్వరలోనే మన దేశంలో లాంచ్ చేయటానికి షియోమీ సిద్ధమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీన ఈ ఫోన్లు భారతదేశంలో లాంచ్ కానున్నాయి. ఈ క్రమంలోనే రెడ్ మీ 10 సిరీస్, రెడ్ మీ నోట్ 10 ఎస్ ఫోన్లు కూడా త్వరలోనే మన దేశంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మన దేశంలో లాంచ్ అయిన రెడ్ మీ 9 సిరీస్ తర్వాత వెర్షన్ గా 10 సిరీస్ వెర్షన్ లాంచ్ కానుంది.
రెడ్ మీ 9 సిరీస్‌లో రెడ్ మీ 9, రెడ్ మీ 9 పవర్, రెడ్ మీ 9ఐ, రెడ్ మీ 9 ప్రైమ్. రెడ్ మీ 9ఏ ఫోన్లు లాంచ్ అయ్యాయి. రెడ్ మీ 10 సిరీస్‌లో కూడా ఇదే తరహాలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.91మొబైల్స్ రెడ్ మీ 10 సిరీస్ మనదేశంలో లాంచ్ అవుతున్నట్లు సమాచారం.
ఈ 10 సిరీస్ గురించి లాంచింగ్ తేదీ, ఈ సిరీస్ ప్రత్యేకతలు గురించి తెలియడం లేదు. గత ఏడాది రెడ్ మీ 9 సిరీస్ ఫోన్లు రూ.10 వేల ధరలోనే లాంచ్ అయ్యాయి. కనుక రెడ్ మీ 10 సిరీస్ ఫోన్లు కూడా 10 వేల ధరలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో బ్లూ, గ్రే, వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.