ప్రముఖ నటుడు, సంఘ సంస్కర్త సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో గత 4 రోజుల నుంచి ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగం సోదాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయన రూ.20 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టారని ఐటీ విభాగం తెలిపింది. బోగస్ లోన్లు తీసుకోవడంతోపాటు విదేశాల నుంచి నిధులను రాబట్టడంలో నిబంధనలను ఆయన ఉల్లంఘించారని ఐటీ శాఖ అధికారులు ఆరోపించారు. అయితే ఈ విషయంపై సోనూసూద్ స్పందించారు.
గత కొద్ది రోజులుగా తన ఇళ్లు, ఆఫీసులకు అతిథులు వస్తున్నారని, అందువల్ల ప్రజా సేవ చేయలేకపోతున్నానని సోనూ సూద్ తెలిపారు. మళ్లీ ప్రజలకు సేవ చేసేందుకు అందుబాటులో ఉంటానన్నారు. తన ఫౌండేషన్‌లో ప్రతి ఒక్కరు ఇందుకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నారు. తనకు ఎండార్స్‌మెంట్ల ద్వారా లభించే ఆదాయం మొత్తాన్ని పేదల కోసం సహాయం చేసేందుకు విరాళం ఇవ్వాల్సిందిగా ఆయా కంపెనీలను కోరినట్లు తెలిపారు.
“सख्त राहों में भी आसान सफर लगता है,
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY— sonu sood (@SonuSood) September 20, 2021
తన గురించి ప్రజలకు తెలుసని, తాను ఏమిటనేది అందరికీ తెలుసని, దాని గురించి కథలు చెప్పాల్సిన పనిలేదని సోనూ సూద్ తెలిపారు. దేశ ప్రజలందరూ తన వెంట ఉన్నారని సోనూసూద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో భావోద్వేగ పోస్టు పెట్టారు.