ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు అధికంగా నమోదవుతుడడంతో మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తారనే ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ పెడితే ఆర్థిక వ్యవస్థ పై కోలుకోలేని దెబ్బ నిపుణులు తెలియజేస్తున్నారు.
కరోనా ప్రభావంతో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి.అంతర్జాతీయ ముడి చమురుకు ప్రామాణికంగా తీసుకునే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.6% పడిపోయాయి. ఇప్పటికే చాలా దేశాలలో డిమాండ్ పెరుగుతున్న క్రమంలో చమురు ధరలు పడిపోతున్నాయి.
ముడి చమురుకు ఎంతో డిమాండ్ పెరిగినా అమెరికా, భారత్ వంటి దేశాలు మార్కెట్ సెంటిమెంట్లు కూడా ముడి చమురు ధరలు పెరగడానికి కారణమైందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని దేశాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. మరిన్ని దేశాలు కూడా అదే బాటలో పయనిస్తాయన్న ఆలోచనలే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయని, ఈక్రమంలోనే చమురు ధరలు మరింత ప్రభావితం అవుతాయని పీవీఎం ఆయిల్ అసోసియేట్స్ కు చెందిన మార్కెట్ విశ్లేషకుడు తమస్ వర్గ అన్నారు.