బీహార్‌లోని ఖగారియా జిల్లాలో వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్‌లో ఆ బ్యాంక్ సిబ్బంది పొరపాటున కొన్ని లక్షల రూపాయలను జమ చేశారు. అయితే ఆ వ్యక్తి మాత్రం వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు కలగజేసుకోక తప్పలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్‌లోని ఖగారియా జిల్లా భక్తియార్‌పూర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్‌కు అక్కడి గ్రామీణ్ బ్యాంకులో అకౌంట్ ఉంది. అయితే అతని అకౌంట్‌లో ఆ బ్యాంకు సిబ్బంది పొరపాటున రూ.5.50 లక్షలను వేశారు. దీంతో తప్పు జరిగిందని తెలుసుకుని ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని తీసి వాడుకున్నాడు.
బ్యాంకు వారు ఆ మొత్తం తిరిగి ఇవ్వాలని, పొరపాటున పడిందని ఎంత చెప్పినా అతను వినలేదు. ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తారని చెప్పారని, అందులో భాగంగా మొదటి ఇన్‌స్టాల్ మెంట్ కింద ఆ మొత్తాన్ని వేశారని అతను బ్యాంకు వాళ్లకు చెప్పాడు. అంతేకాదు, ఆ మొత్తాన్ని బ్యాంకు వారు రికవరీ చేసేలోగానే అతను విత్‌డ్రా చేసేశాడు. అడిగితే ఖర్చు పెట్టానన్నాడు. దీంతో పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయగా.. వారు రంజిత్ దాస్‌ను అరెస్టు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…