ఓలా ఎలక్ట్రిక్ సంస్థ గత నెలలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రొ పేరిట రెండు నూతన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ స్కూటర్లకు గాను ఆ సంస్థ బుధవారం నుంచి బుకింగ్స్ ను ప్రారంభించింది. కనుక కస్టమర్లు వీటిని ప్రస్తుత కొనుగోలు చేయవచ్చు. గతంలో ప్రి-బుకింగ్ చేసుకున్నవారు ఈ స్కూటర్లను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలోనే ఈ రెండు స్కూటర్లు భిన్న రకాల కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసేందుకు కింద సూచించిన స్టెప్స్‌ను అనుసరించాలి.
స్టెప్ 1 : ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్‌చేయాలి. తరువాత ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేసి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 2 : ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రొలలో ఏదైనా ఒక మోడల్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 3 : ఈ రెండు స్కూటర్లకు గాను 10 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దేన్నయినా ఎంచుకోవాలి.
స్టెప్ 4 : మీరు ఎంచుకున్న ఎలక్ట్రిక్ బైక్‌కు గాను పేమెంట్ చేయాలి. అయితే వీటికి లోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు. ఓలా ఎస్1కు రూ.2,999, ఎస్1 ప్రొ కు రూ.3199 ఈఎంఐతో లోన్ పొందవచ్చు.
స్టెప్ 5 : లోన్ ద్వారా వీటిని కొనుగోలు చేయాలని భావిస్తే ఎస్1కు రూ.20వేలు, ఎస్1 ప్రొ స్కూటర్‌కు రూ.25వేల అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది.
స్టెప్ 6 : కొనుగోలు పూర్తయ్యాక కస్టమర్లకు డెలివరీ డేట్‌ను అందిస్తారు. ఆ తేదీ రోజు స్కూటర్‌ను ఇంటికే డెలివరీ చేస్తారు.
ఈ విధంగా చాలా సులభంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…