కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధించిన విషయం విదితమే. ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయితే ఈ జాబితాలోకి తాజాగా గోవా కూడా వచ్చి చేరింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అక్కడ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ వెల్లడించారు.
గోవాలో ఏప్రిల్ 29 నుంచి మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడి అన్ని బార్లు, పబ్‌లు, కసినోలు మూత పడనున్నాయి. అయితే రెస్టారెంట్లలో తినేందుకు అనుమతించరు. కానీ హోం డెలివరీలకు అనుమతి ఉంటుంది.
గోవాలో లాక్‌డౌన్ కారణంగా ప్రజా రవాణాను కూడా నిలిపివేయనున్నారు. ఇక కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిత్యావసరాలను కొనేందుకు ప్రజలకు రోజూ కొంత సమయం పాటు అనుమతించనున్నారు. కరోనా చెయిన్‌ను బ్రేక్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.