భార‌త‌దేశం

24 ఏళ్ల కింద‌ట చ‌నిపోయాడ‌నుకున్న వ్య‌క్తి.. ఇప్పుడు మ‌ళ్లీ తిరిగొచ్చాడు.. ఆశ్చ‌ర్యంలో కుటుంబ స‌భ్యులు..!

క‌నిపించ‌కుండా పోయిన వ్య‌క్తులు తిరిగి కుటంబ స‌భ్యుల‌ను చేరుకోవడం అనేది చాలా అరుదుగా జ‌రుగుతుంటుంది. పోలీసులు అన్ని విధాలుగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే కొంత వ‌ర‌కు ఈ విష‌యంలో ఫ‌లితం ద‌క్క‌వ‌చ్చు. కానీ ఒక్కోసారి వారు కూడా ఏమీ చేయ‌లేరు. దీంతో మిస్సింగ్ అయిన వ్య‌క్తుల వివ‌రాలు అస‌లు ఏమీ తెలియవు. అయితే ఆ వ్య‌క్తి కూడా ఇలాగే 24 ఏళ్ల కింద‌ట ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లి కనిపించ‌కుండా పోయాడు. చాలా ఏళ్లు గ‌డిచాయి. ఇక అత‌ను చ‌నిపోయాడ‌నే అంద‌రూ భావించారు. కానీ ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ అత‌ను ఇప్పుడు ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో కుటుంబ స‌భ్యులు ఓ వైపు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూనే మ‌రో వైపు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఉత్త‌రాఖండ్ లోని అల్మోరా జిల్లాలో ఉన్న రాణిఖేత్ అనే ప్రాతానికి చెందిన మ‌ధో సింగ్ మెహ్రా 24 ఏళ్ల కింద‌ట ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అత‌ని కుటుంబ స‌భ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే ఎన్ని ఏళ్లు గ‌డిచినా అత‌ను తిరిగి రాలేదు. దీంతో అత‌ను చ‌నిపోయి ఉంటాడ‌ని భావించిన కుటుంబ స‌భ్యులు అత‌నికి ప్ర‌తి ఏడాది క‌ర్మ‌లు చేయ‌డం ప్రారంభించారు.

అయితే ఇటీవ‌లే అత‌ను త‌మ గ్రామానికి స‌మీపంలోని పొలాల్లో కొంద‌రికి క‌నిపించాడు. అత‌నికిప్పుడు 72 ఏళ్లు కావ‌డంతో వృద్ధాప్యం వచ్చేసింది. అయిన‌ప్ప‌టికీ గ్రామ వాసులు అత‌న్ని గుర్తించి అత‌న్ని ఇంటికి తీసుకువ‌చ్చారు. అయితే కుటుంబ స‌భ్యులు మొద‌ట ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసినా త‌రువాత భ‌య‌ప‌డ్డారు. అత‌ను చ‌నిపోయాడ‌ని ఇన్నాళ్లూ అత‌నికి క‌ర్మ‌లు చేశారు క‌నుక‌.. దాని నుంచి విముక్తి పొందాలంటే మ‌ధో సింగ్‌కు మ‌ళ్లీ నామ‌క‌ర‌ణం చేసే కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని పండితులు చెప్పారు. దీంతో వారు అత‌న్ని అప్ప‌టి వ‌ర‌కు ఇంట్లోకి రానిచ్చేది లేద‌ని చెబుతూ ఇంటి బ‌య‌టే టెంటు వేసి ఉంచారు. త్వ‌ర‌లో ఆ తంతు ముగియ‌గానే మ‌ళ్లీ అత‌న్ని ఇంట్లోకి తీసుకువెళ్తామ‌ని చెబుతున్నారు.

ఇక అత‌నికి భార్య, కుమారుడు, కుమార్తె ఉండ‌గా వారికి పెళ్లిళ్లు అయిపోయి స్థిర ప‌డ్డారు. మ‌ధో సింగ్ అదృశ్యం అయిన‌ప్ప‌టి నుంచి అత‌ని భార్య విధ‌వ‌గానే ఉంటోంది. మ‌ధోసింగ్ మిస్సింగ్ అయిన‌ప్పుడు అత‌ని పిల్ల‌లు చాలా చిన్న‌వారు. ఇప్పుడు అత‌ను వృద్ధుడు అయ్యాడు. పిల్లలు పెద్ద‌గై పెళ్లి చేసుకున్నారు. దీంతో అంతా ఒక్క‌సారిగా మారిపోయింది. అయితే అత‌ను ఇన్ని రోజులూ ఎక్క‌డ ఉన్నాడు, ఏం చేశాడు, అస‌లు మ‌ళ్లీ సొంత ఊరికి ఎలా వ‌చ్చాడు ? అనే వివ‌రాల‌ను అత‌ను గుర్తు పెట్టుకోలేదు. ఎవ‌రేం అడిగినా త‌న‌కు ఏమీ గుర్తు లేద‌ని చెబుతున్నాడు. ఏది ఏమైనా.. ఇది చాలా వింత‌గా అనిపిస్తోంది క‌దా..!

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM